Politics

అఖిల అక్కయ్య ఆరోగ్యం బాలేదు-తాజావార్తలు

* కిడ్నాప్‌ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని ఆమె సోదరి భూమా మౌనిక అన్నారు. తన సోదరిపై చేసిన ఆరోపణలకు ఏమాత్రం ఆధారాల్లేవని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో మౌనిక మాట్లాడారు. ‘‘రాత్రికి రాత్రి ఏవీ సుబ్బారెడ్డిని ఏ1 నుంచి ఏ2గా మార్చారు. మా అక్కని కలవడానికి వెళితే ఆమె కళ్లు తిరిగి పడిపోయిన పరిస్థితి. ఆరోగ్య పరిస్థితిపై కోర్టులో సరిగా సమర్పించలేని విధంగా వ్యవస్థ ఉంది. భూ వివాదం మా నాన్న ఉన్నప్పటి నుంచి ఉంది. సివిల్‌ సమస్య ఉంటే వచ్చి మాట్లాడతాం.. కూర్చొని మాట్లాడి సెటిల్‌ చేసుకుందాం. ఎలాంటి వివాదమైనా కూర్చొని మాట్లాడుకుంటే తేలిపోతుంది. మమ్మల్ని ఎందుకు టార్చర్‌ చేస్తున్నారు? మా నాన్న చనిపోయాక ఈ విధంగా ప్రవర్తి్స్తున్నారు.

* ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఒక కలలాంటిది. ఆ కలను నెరవేర్చుకునేందుకు ప్రతి పైసా కూడబెడతాం. ఓ మహిళ సొంతింటి కలను స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే నెరవేర్చింది. డబుల్‌ బెడ్‌రూం పథకంలో భాగంగా ఆమెకు ఇంటిని మంజూరు చేసింది. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇక హమ్మయ్య అనుకుంటారు. వారి తర్వాత వారసులకు ఆ ఇల్లు ఉంటుందనే భరోసాతో జీవనం సాగిస్తారు. కానీ సిద్దిపేటలో ఓ మహిళ దీనికి భిన్నంగా చేసిన పనితో అందరి మన్ననలు అందుకుంటున్నారు.

* తూర్పుగోదావరి జిల్లాలో రేపు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటనకు పోలీసులు అనుమతించారు. తొలుత అనుమతి నిరాకరించినా ఆ తర్వాత జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మీ ఫోన్‌ చేశారు. పవన్‌ పర్యటనకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు నాదెండ్ల మనోహర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

* సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త..! ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ – విశాఖపట్నం- హైదరాబాద్‌; సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య పలు రైలు సర్వీసులను నడపనున్నట్టు ప్రకటించింది. 07451 నంబర్‌ గల రైలు ఈ నెల 9నుంచి (రేపటి నుంచి) 16 వరకు ప్రతిరోజూ నడపనున్నట్టు తెలిపింది. ఈ రైలు హైదరాబాద్‌లో రాత్రి 10.15గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటలకు విశాఖ చేరుకోనుంది.

* రాజకీయంగా తమను వేధిస్తున్నారని ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి ఆరోపించారు. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అరెస్టయిన నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అఖిలప్రియకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఇబ్బంది పెడుతున్నారన్నారు. తన సోదరిపై తప్పుడు సెక్షన్లతో కేసులు పెట్టారని జగత్‌ విఖ్యాత్‌ ఆరోపించారు. అసలేమాత్రం సంబంధం లేని కేసులో అరెస్ట్‌ చేశారన్నారు. తమను ఇంతలా భయపెట్టి ఏం సాధించదలచుకున్నారని ఆయన ప్రశ్నించారు.

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కలిసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులు, టీకా షెడ్యూల్‌ వల్ల ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ప్రొసీడింగ్స్‌ని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు, ఇరువర్గాలు కూర్చుని ఎన్నికల నిర్వహణపై మాట్లాడుకోవాలని.. ముగ్గురు సీనియర్‌ అధికారులను ఎస్‌ఈసీ వద్దకు పంపాలని ప్రభుత్వానికి సూచించింది.

* హైదరాబాద్‌ భూ వివాదం కిడ్నాప్‌ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ‌ రామ్‌ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏ-1 నిందితురాలిగా అఖిలప్రియ, ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-3గా భార్గవ ‌రామ్‌ ఉన్నట్లు తెలిసిందే. అయితే, ప్రస్తుతం పరారీలో ఉన్న భార్గవ‌ రామ్‌ బెంగళూరులో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చేపట్టారు. అతను బెంగళూరులోనే ఉన్నాడా? లేక అక్కడి నుంచి మరెక్కడికైనా పారిపోయాడా అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. భార్గవ‌ రామ్‌ బంధువులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లపైనా నిఘా పెట్టారు.

* బ్రిటన్‌లో కొవిడ్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న తరుణంలో అక్కడి నుంచి 246 మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమానం దిల్లీ చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బ్రిటన్‌లో స్ట్రెయిన్‌ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారత్‌ డిసెంబర్‌ 23 నుంచి బ్రిటన్‌కు విమానాల రాకపోకలను నిలిపివేశారు. తాజాగా యూకే నుంచి విమానాలకు భారత ప్రభుత్వం అనుమతించడంతో ఇవాళ ఉదయం ఎయిరిండియా విమానం దిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది.

* ఇన్‌స్టా మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీపై కీలక ప్రకటన చేసింది. వాట్సాప్‌ బిజినెస్‌ ఖాతాదారులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఫేస్‌బుక్‌తో షేర్‌ చేసుకుంటామని తెలిపింది. అలానే వాట్సాప్‌ వ్యక్తిగత ఖాతాల వివరాలు వ్యాపార అవసరాలకు ఉపయోగించమని పేర్కొంది. వాట్సాప్‌ తాజా ప్రకటనతో యూజర్స్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితికి తెరదించినట్లయింది. అయితే దీనికి కొద్ది గంటల ముందు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వాట్సాప్ కొత్త పాలసీపై స్పందించారు. వాట్సాప్‌కి బదులు సిగ్నల్ యాప్ ఉపయోగించాలని ట్వీట్ చేశారు. దీంతో సిగ్నల్ యాప్‌కి యూజర్స్‌ తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

* పంచభూతాలనూ దోచుకుంటున్న పార్టీ తెరాస.. వాటిని పూజించే పార్టీ భాజపా అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెరాస పాలనపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తర్వాత వచ్చేది భాజపా ప్రభుత్వమేనన్నారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదని.. సీఎం కేసీఆర్‌ మెప్పు పొందేందుకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు తిరగబడతారనే విషయాన్ని తెరాస నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కలిసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులు, టీకా షెడ్యూల్‌ వల్ల ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని.. ప్రొసీడింగ్స్‌ని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన హైకోర్టు, ఇరువర్గాలు కూర్చుని ఎన్నికల నిర్వహణపై మాట్లాడుకోవాలని.. ముగ్గురు సీనియర్‌ అధికారులను ఎస్‌ఈసీ వద్దకు పంపాలని ప్రభుత్వానికి సూచించింది.