DailyDose

ఆ చైనా వ్యాక్సిన్ అతి ప్రమాదకరం-నేరవార్తలు

ఆ చైనా వ్యాక్సిన్ అతి ప్రమాదకరం-నేరవార్తలు

* చైనా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌పై అదే దేశానికి చెందిన ఓ వైద్యనిపుణుడు టావో లినా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ టీకా అత్యంత ప్రమాదకరమైనది అని సురక్షితం కాదని, దాని వలన 73 రకాల దుష్ర్పభావాలు తలెత్తుతాయని వెల్లడించారు.

* నెల్లూరుజిల్లా వెంకటగిరిలో జిల్లా అటవీశాఖ అధికారి షణ్ముఖకుమార్ ప్రెస్మీట్ నిర్వహించారు.ఈ ప్రెస్ మీట్ లో ఆంద్రప్రదేశ్, తమిళనాడు అధికారులు అక్రమంగా తరలిస్తున్న పూడుపాములను స్వాధీనం చేసుకున్నామని వివరించారు.ఏపీలో… సౌత్ ఇండియా రీజన్ సెంట్రల్ వైల్డ్ లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో & ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాయింట్ ఆఫరేషన్ చేశారు.నాయుడుపేట జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న కోట్లు విలువచేసే పూడుపాముల తో పాటు అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాను తమిళనాడు, ఏపీ అధికారులు స్ట్రింగ్ ఆపరెషన్ చేసి పట్టుకున్నారు.ఈ క్రైమ్ కు సంబంధించి ఏపీ కి చెందిన మొత్తం 7 మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.నిందితుల దగ్గర నుండి ఒక పూడుపాము, 8 మొబైల్ పోన్స్, 2 లాప్ టాప్స్, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.పూడుపాములను మెడిసిన్ కు వాడుతారు అనేవి వట్టి మూఢనమ్మకాలు అని మూగ జీవులు,వన్యప్రాణులని తరలించడం నేరమని తెలియచేసారు.

* శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న తరుని హోటల్ దగ్గర గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులు సృష్టించిన అల్లర్లపై తాజాగా స్పందించారు.వాషింగ్టన్ డీసీలో హింస, అల్లకల్లోలం పట్ల తాను ఎంతో ఆగ్రహానికి గురైనట్టు ఆయన ట్విటర్ ద్వారా చెప్పుకొచ్చారు.అల్లర్లు మొదలైన వెంటనే చొరబాటుదారులను అక్కడి నుంచి తొలగించేందుకు తాను నేషనల్ గార్డ్స్, ఫెడరల్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌‌ను రంగంలోకి దింపానని ఆయన అన్నారు.

* ముంబయి పేలుళ్ల కేసులో సూత్రధారి, లష్కరే తోయిబా కమాండర్​ జకీ-ఉర్​-రెహ్మాన్​ లఖ్వీకి 15 ఏళ్ల జైలు విధించింది పాకిస్థాన్​లోని ఓ కోర్టు.