NRI-NRT

బైడెన్ ఇమ్మిగ్రేషన్ ప్రకటన

బైడెన్ ఇమ్మిగ్రేషన్ ప్రకటన

తాను బాధ్యతలు చేపట్టగానే మొట్టమొదటగా ఇమ్మిగ్రేషన్ బిల్లును ప్రవేశపెడతానని అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ స్పష్టం చేశారు. దానిని సంబంధిత కమిటీలకు పంపి త్వరితగతిన కార్యరూపం దాల్చేలా చూస్తామని వెల్లడించారు. శుక్రవారం బైడెన్ డెలావేర్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ వైఖరిని వెల్లడించారు. తాను బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లో ఇమ్మిగ్రేషన్ చట్టంలో పూర్తి స్థాయి మార్పులు తీసుకు వస్తామని ఎన్నికల ప్రచారంలో బైడెన్ వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకు వచ్చిన క్రూరమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను పక్కనపెడతామని వెల్లడించారు. అమెరికాలో ఆశ్రయం పొందడానికి అనుమతించిన వారిపై కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యం గల విదేశీయులకు మాత్రమే తమ దేశంలో చోటిచ్చేలా నిర్ణయాలు తీసుకుంది.