Politics

అబ్బయ్య చౌదరి వంగవీటి వర్గాల ఘర్షణ-నేరవార్తలు

అబ్బయ్య చౌదరి వంగవీటి వర్గాల ఘర్షణ-నేరవార్తలు

* పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు శాసనసభ్యులు అబ్బయ్య చౌదరి మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధా వర్గీయుల మధ్య శనివారం సాయంత్రం హనుమాన్ జంక్షన్ లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.దీంతో కలకత్తా – చెన్నై జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సేకరించిన సమాచారం మేరకు ఏలూరు వైపు నుంచి దెందులూరు శాసన సభ్యులు అబ్బయ్యచౌదరి మరియు వంగవీటి రాధ లు ఎవరి వాహనాల్లో వారు విజయవాడ వైపు వెళుతున్నారు.ఇరువురు వాహనాలు జంక్షన్ కూడలిని దాటిన అనంతరం వాహనాలు ముందుకు వెళ్లే క్రమంలో ఎమ్మెల్యే అనుచరులకు చెందిన వాహనాలు కొన్ని ముందుకు వెళ్లాయి.ఎమ్మెల్యే వాహనం మధ్యలో ఉండిపోవడంతో ఆయన అనుచరులు రాధ అనుచరులను ప్రక్కకు తప్పుకోవాలని కేకలు వేసినట్లు తెలుస్తుంది.

* 62 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండోనేషియా విమానం ఒకటి మిస్సింగ్ అయంది.జకర్తా ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన కాసేపటికే రాడార్‌తోో సంబంధాలు తెగిపోయాయి.ఇండోనేషియాలో ఓ విమానం అదృశ్యమవడం కలకలం రేపుతోంది.జకర్తా ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన శ్రీవిజ‌య సంస్థకు చెందిన బోయింగ్-737 విమానం బయల్దేరిన కాసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.విమానంలో క్రూ సిబ్బందితో పాటు 62 మంది ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక కాల‌మానం ప్రకారం శనివారం (జనవరి 9) మ‌ధ్యాహ్నం 2.40 గంట‌ల‌కు విమానంతో రాడార్‌కు సంబంధాలు తెగిపోయాయ‌ని అధికారులు తెలిపారు.

* చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కట్టకింద రామకృష్ణా పురం లో అప్పులు బాధ తాళలేక కృష్ణారెడ్డి అనే కౌలు రైతు పురుగులు మందు తాగి ఆత్మహత్య

* పాలకొల్లు వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శనివారం ఉదయం నిరాహార దీక్ష చేపట్టారు.

* ఏపీ సీఎం జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు.!ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.ఈనెల 11న విచారణకు హాజరు కావాలని జగన్‌కు ఈడీ కోర్టు ఆదేశించింది.అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్ ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది.అరబిందో, హెటిరో భూ కేటాయింపుల ఛార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు.. విజయసాయి రెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బి.పి.ఆచార్యకు ఈడీ కోర్టు సమన్లు ఇచ్చింది.