Health

యూకె కరోనా అయిపోయింది. ఇప్పుడు అమెరికా కరోనా.

యూకె కరోనా అయిపోయింది. ఇప్పుడు అమెరికా కరోనా.

టీకాలు వచ్చాయని సంతోషపడేలోపే.. కరోనా వైరస్ రూపు మార్చుకుంటూ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే యూకే, దక్షిణాఫ్రికాలో కొత్త రకం కరోనా వైరస్‌ను గుర్తించగా..తాజాగా యూఎస్‌ రకం వెలుగులోకి వచ్చింది! అమెరికాలో ఉత్పరివర్తన చెందిన ఈ వైరస్ గురించి రాష్ట్రాలకు వైట్‌ హౌజ్ కరోనావైరస్ టాస్క్‌ ఫోర్స్ హెచ్చరికలు కూడా చేసిందని మీడియా కథనం. జనవరి మూడునే ఈ కొత్త రకంపై రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు పేర్కొంది. వసంతకాలం, వేసవి కాలాలతో పోల్చితే యూఎస్‌లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం రోజూవారీ మరణాలు 4వేలకు చేరువయ్యాయి. ‘ఈ విజృంభణ చూస్తుంటే..ఇక్కడ ఉద్భవించిన యూఎస్ రకం అయి ఉండొచ్చు. యూకే రకంతో పాటుగా ఇది కూడా వ్యాపించింది. దాని వ్యాప్తి 50 శాతం అధికంగా ఉండే అవకాశం ఉంది’ అని టాస్క్‌ఫోర్స్‌ రాష్ట్రాలను హెచ్చరించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నియమాలను సరిగా పాటించకపోవడంతో ఈ వైరస్ రకాలు వ్యాప్తి చెంది, అంటువ్యాధులను తీవ్రం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటన్‌లో కొత్త రకం వ్యాప్తి చెందుతున్నట్టుగానే టాస్క్‌ఫోర్స్ గుర్తించిన యూఎస్ రకం తీరు కూడా ఉందని ఆహార, ఔషధ సంస్థ మాజీ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. మరోవైపు, అమెరికాలో 52 యూకే రకం వైరస్‌ కేసులను గుర్తించారు. అయితే దీని వల్ల మరణాల తీవ్రత అధికంగా ఉంటుందనే ఆధారాలు మాత్రం లభించలేదని నిపుణులు అంటున్నారు.