Fashion

పెళ్లి చేసుకోకపోతే గుండెపోటు

పెళ్లి చేసుకోకపోతే గుండెపోటు

పెండ్లంటే బాధ్యతల చెరసాలలో చిక్కుకున్నట్టే. స్వేచ్ఛ ఉండదు. బతుకు ఉండదు.. ఇలా అనుకుంటూ పెండ్లి వాయిదా వేసుకుంటూ పోతుంటారు కొందరు. ఇలాంటి బ్యాచిలర్స్‌కి ఓ బ్యాడ్‌ న్యూస్‌. సరైన వయసులో పెండ్లి చేసుకోకుండా వాయిదాలు వేసుకుంటూ పోతే గుండెను ప్రమాదంలోకి నెట్టినట్టే అంటున్నారు పరిశోధకులు. బ్రిటన్‌లో చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఒంటరిగా ఉంటున్నవాళ్లతో పోలిస్తే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని సదరు పరిశోధకులు చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా 10 లక్షల మంది అవివాహితులను, వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. వీరంతా అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌ వంటి రుగ్మతలతో బాధపడుతున్నట్టు గుర్తించారు. వయసు పైబడిన పెండ్లికాని ప్రసాదుల కన్నా.. వివాహితులు 16 శాతం ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతుకుతున్నట్టు తేల్చారు. అందుకే ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలని సూచిస్తున్నారు.