DailyDose

బోయిన్‌పల్లి కేసులో సరికొత్త ట్విస్ట్-నేరవార్తలు

బోయిన్‌పల్లి కేసులో సరికొత్త ట్విస్ట్-నేరవార్తలు

* బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు.. మరో ముగ్గురి అరెస్ట్.సికింద్రాబాద్​​ బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్‌ కేసులో మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.నిందితులు వాడిన చరవాణులు, వాహనాల నకిలీ నంబర్‌ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ పోలీసులకు వివరించారు.ఈ అపహరణ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారన్నారు.కిడ్నాప్‌ ఘటనలో నిందితులు 6 సిమ్‌ కార్డులు వాడినట్లు సీపీ వెల్లడించారు.అపహరణ సమయంలో వాహనాలకు నకిలీ నంబర్‌ ప్లేట్లు బిగించారన్నారు.ప్రవీణ్ సోదరుల అపహరణ కేసులో అఖిలప్రియ ఏ-1 నిందితురాలిగా ఉన్నారని చెప్పారు.అఖిలప్రియ సూచన మేరకు నిందితులు.. ప్రవీణ్‌రావు ఇంటి వద్ద రెక్కీ చేశారని సీపీ వివరించారు.కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు.

* విజయవాడ రూరల్ మండలం నిడమానురులో విషాదం..అనుమానాస్పద స్థితిలో అంజూరి రాము(40) అనే వ్యక్తి మృతి..తన ఇంటివద్ద రక్తపు మడుగులో పడి ఉన్న మృతుడు..

* భూమా అఖిల ప్రియ ను చంచల్ గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు…చంచల్ గూడ జైల్ నుండి బేగంపేట మహిళ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు..ఈరోజు నుండి కిడ్నాప్ కు సంబంధించిన వివరాల పై కూపీ లాగనున్న పోలీసులు.

* పొలం అమ్మిన డబ్బు విషయంలో బంధువుల మధ్య తలెత్తిన వివాదం ఓ మహిళ హత్యకు దారితీసింది.ఆమె తన భర్త, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కక్ష కట్టిన బంధువు వారిని తన వాహనంతో ఢీకొట్టాడు. అంతటితో ఆగక మీదికెక్కించి మహిళను అంతమొందించాడు. గాయాలతో తప్పించుకున్న ఆమె భర్త, కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అత్యంత హేయమైన ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో సంచలనం రేపింది. మహాబూబ్ నగర్ జిల్లా బాలానగర్‌ మండలం మాచారం గ్రామానికి చెందిన యాదయ్య( ప్రస్తుతం షాద్‌నగర్‌లో ఉంటున్నారు) యాదయ్య తల్లి, ఆమె ముగ్గురు చెల్లెళ్లకు కలిపి జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో ఎకరం ఎనిమిది గుంటల పొలం ఉంది.దీన్ని ఆర్నెల్ల కిందట యాదయ్య రూ.80 లక్షలకు విక్రయించారు. అందులో తమ వాటా డబ్బు ఇవ్వాలని చిన్నమ్మ కుమారులు అడిగినా ఎవరికీ ఇవ్వలేదు…ఈ క్రమంలో ఆదివారం ఉదయం యాదయ్య తన భార్య శైలజ (35), కుమార్తె నిహారిక(15)తో కలిసి ద్విచక్రవాహనంపై నవాబ్‌పేట మండలం కారుకొండలో బంధువుల శుభకార్యానికి వెళ్లారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి షాద్‌నగర్‌ బయలుదేరారు…ఇది గమనించిన యాదయ్య చిన్నమ్మ కుమారుడు.. మహబూబ్‌నగర్‌లోని ఏనుగొండలో నివాసముంటున్న నర్సింహులు సరకు రవాణా వాహనంతో వెంబడించాడు…మాచారం శివారులో వెనుక నుంచి వచ్చి యాదయ్య ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ముగ్గురూ కింద పడిపోయారు. వెంటనే తేరుకొన్న యాదయ్య లేచి కొంతదూరం పరుగులు తీశారు…కింద పడిపోయిన ఆయన భార్య శైలజ పైకి లేచేందుకు ప్రయత్నిస్తుండగా.. నర్సింహులు తన వాహనాన్ని మళ్లీ వెనక్కు పోనిచ్చి రెండోసారి ఢీకొట్టాడు…తిరిగి ఆమె కింద పడిపోవడంతో వాహనాన్ని శైలజ పైకి ఎక్కించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. అనంతరం నిందితుడు తన వాహనంతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.