Politics

ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్టు-తాజావార్తలు

ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేసిన హైకోర్టు-తాజావార్తలు

* వ్యవసాయ చట్టాలపై స్టే విధించినా ఆందోళన కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు తెలిపారు. చట్టాల అమలు కొంతకాలం పాటు నిలిపివేయడం పెద్ద విషయమేమీ కాదని అన్నారు. పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

* చనిపోయిన కాకులు మరియు బాతుల నుండి ఎనిమిది నమూనాలను పరీక్షించిన తరువాత బర్డ్ ఫ్లూ నిర్ధారించ బడిందని ఏవియన్ ఫ్లూ కోసం పరీక్షించిన అన్ని నమూనాలలో బర్డ్ ఫ్లూ అవశేషాలు లభించాయని ఢిల్లీ పశుసంవర్ధక విభాగం తెలిపింది.

* ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్.పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్‌ చేసిన హైకోర్టు.ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన హైకోర్టు.వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే షెడ్యూల్‌ సస్పెండ్ చేస్తున్నామన్న హైకోర్టు. పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలంటూ పిటిషన్‌ వేసిన ప్రభుత్వం .ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్‌ జనరల్‌.హైకోర్టులో ఎస్‌ఈసీ తరఫున వాదిస్తున్న న్యాయవాది అశ్వినీకుమార్‌.ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితి ఉందన్న ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది.కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరిన ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది.పంచాయతీ ఎన్నికలపై ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన ఎస్‌ఈసీ.

* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ఈ సాగు చట్టాల అమలుపై స్టే ప్రకటించారు. కొత్త సాగు చట్టాలపై ఏం జరుగుతోందో కేంద్రం గుర్తిస్తోందా? ఈ చట్టాలపై రాష్ట్రాలు తిరగబడుతున్న విషయం మీకు తెలుసా అని నిలదీసింది.

* రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍పై వేటు వేసిన ఎస్‍ఈసీ – 30 రోజులపాటు సెలవుపై వెళ్లడమే కాకుండా.. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఆరోపణలు – క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ – ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయన్న ఎన్నికల సంఘం – ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధులనుంచి తొలగిస్తున్నాం – ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదన్న ఎస్‍ఈసీ

* ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ వెలురించిన నిర్ణయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. డివిజన్‌ బెంచ్‌లో అప్పీలుకు వెళ్లింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. సంక్రాంతి నేపథ్యంలో వరుస సెలవులున్నందున అత్యవసర పిటిషన్‌గా భావించి విచారించాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది డివిజన్‌ బెంచ్‌ను కోరారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తున్నట్లు చేస్తున్నట్లు ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

* హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయడం ప్రజలు, ఫ్రంట్‌లైన్‌ వారియర్ల విజయమని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వ్యాఖ్యానించారు. ధర్మాసనం తీర్పుతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న బుగ్గన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి ఇచ్చే నిధులను త్వరగా ఇవ్వాలని కోరారు. ఆయన వెంట ప్రభుత్వప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్ ఉన్నారు.

* తెలంగాణ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో తీపికబురు అందించారు. నూతన సంవత్సర కానుకగా వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచుతామని ఇప్పటికే ప్రకటించిన కేసీఆర్‌.. తాజాగా పదోన్నతుల విషయంలోనూ ఉద్యోగులకు శుభవార్త అందించారు. పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపడతామని సీఎం కేసీఆర్‌ ఇదివరకే చెప్పిన విషయం తెలిసిందే.

* కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే టీకా పంపిణీ కార్యక్రమం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి దశలో భాగంగా మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. అయితే ఈ ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. వ్యాక్సిన్‌ పంపిణీ సన్నాహాలపై నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌ సమావేశంలో మోదీ భేటీ అయ్యారు. టీకా పంపిణీ ఏర్పాట్లపై సీఎంలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు కోట్ల టీకాల పంపిణీ తర్వాత మరోసారి సీఎంలతో భేటీ అవుతానని తెలిపారు. తదుపరి కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చిద్దామని చెప్పారు. ఇక తొలి దశలో ప్రయివేటు లేదా ప్రభుత్వ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు టీకా ఇస్తామన్నారు.

* దేశంలోని పలు రాష్ట్రాల్లో కల్లోలం సృష్టిస్తున్న ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ)పై ప్రజలు అసత్యాలను ప్రచారం చేయొద్దని కేంద్ర పశుసంవర్ధకశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్ కోరారు. ఈ వైరస్‌ వల్ల మానవులకు ఏ విధమైన హాని జరగదన్నారు. పౌల్ట్రీ పదార్ధాలు బాగా ఉడికించి తినాలని ఆయన సూచించారు. ‘‘ బర్డ్‌ఫ్లూ గురించి ప్రజలంతా భయపడుతున్న సమయంలో వదంతులను వ్యాప్తి చేయొద్దు. 2006 నుంచి అప్పుడప్పుడు బర్డ్‌ఫ్లూ కేసులు వస్తూనే ఉన్నాయి. దీని వల్ల మనుషులకు ఏ విధమైన ముప్పులేదు.’’ అని తెలిపారు.

* కరోనా వైరస్‌కు పుట్టినిల్లు చైనాలో దాదాపు ఐదు నెలల తర్వాత అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 103 కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో చివరిగా గతేడాది జులై 30న అత్యధికంగా 127 కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం చైనాలోని పలు ప్రావిన్సుల్లో కొత్తగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుండటంతో అధికారులు వేగంగా కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే హీలోంగ్జియాంగ్‌ ప్రావిన్సులో కొత్తగా కరోనా వైరస్‌ కేసులు నమోదు కావడంతో సోమవారం లాక్‌డౌన్‌ విధించినట్లు సమాచారం.

* ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 1.5 మిలియన్ల ప్రజలకు స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ అందించినట్లు రష్యా సోమవారం ప్రకటించింది. స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌కు ఆర్థిక సహకారాన్ని అందించిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్డీఐఎఫ్) దీనిని ధ్రువీకరించింది. టీకా తీసుకున్నవారిలో రష్యాకు చెందినవారు ఎందరో, మిగతా దేశాలకు చెందిన వారు ఎందరో చెప్పలేమని ఆర్డీఐఎఫ్‌ ప్రతినిధి ఆర్న్సీ పాలాగిన్‌ తెలిపారు. సంబంధిత దేశాలు విడిగా ఈ సమాచారాన్ని అందిస్తాయన్నారు. గతేడాది ఆగస్టులో రష్యా వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసిన మొదటిదేశంగా నిలిచింది. తర్వాత వెంటనే బిలియన్‌కు పైగా ఆర్డర్లు పొందినట్లు రష్యా ప్రకటించింది.

* దిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతిపై దాడి యూపీలో జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించేందుకు రాయ్‌బరేలీలో ప్రభుత్వ అతిథి గృహం నుంచి బయటకు వస్తున్న ఆయన ముఖంపై ఓ వ్యక్తి సిరాతో చల్లాడు. మరోవైపు, ఈ ఘటన అనంతరం పోలీసులు సోమనాథ్‌ భారతిని అరెస్టు చేశారు. యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ అదుపులోకి తీసుకున్నారు. నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం, వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేలా వ్యవహరించినందుకుగాను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆయన్ను అమేఠీకి తరలించారు. ఆయనపై జరిగిన సిరా దాడి ఘటనపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.