Food

రేగి పండుకి…భోగి పండుగకి సంబంధం ఏమిటి?

రేగి పండుకి…భోగి పండుగకి సంబంధం ఏమిటి?

రేగుపండ్లు..: భోగి పండ్లలో వినియోగించే రేగుపండ్లలో రక్తం శుద్ధి చేసే గుణం ఉంటుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు, ప్లవనాయిడ్స్ అధికంగా ఉంటాయీ. శరీరంలో మలినాలను బయటకు పంపడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ పండులోని గుజ్జు మలబద్దకాన్ని నివారిస్తుంది. పులుపు, తీపి లాలాజలాన్ని వృద్ధి చేస్తుంది. జీర్ణ వ్యవస్థను వేగవంతం చేయడం ద్వారా ఆహరం త్వరగా జీర్ణమవుతుంది.భోజనం తర్వాత రేగుపండ్లను తీసుకోవడం మంచిది. ఈ పండ్లను తినడం ద్వారా నోటి పూత, చిగుళ్ళ వాపులు కూడా తగ్గుతాయి.
**పొంగలి..: దంపుడు బియ్యం, బెల్లం, ఆవు పాలతో చేసే పొంగలి కూడా ఎన్నో ఔషద గుణాలు కలయిక. ఇది పిల్లల్లు, పెద్దలకు పుష్టికరమైన పరిపూర్ణ ఆహరం. ఇందులోని విటమిన్లు, ప్రోటీన్లుతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
**చెరుకు..: చెరుకులో కాల్షియం, రసంలో గ్లూకోజు అధికంగా ఉంటాయి. చెరుకు ముక్కలను నమిలి రసాన్ని పీల్చడం ఉత్తమం. దీంతో నోటిలో లాలాజలం ఊరి ఆకలి పెరుగుతుంది. సత్వర శక్తి ఇస్తుంది.విరేచనాలు, అతి సారంతో బాధపడుతున్న వారికీ ఔషదంలా పనిచేస్తుంది. చేర్తుకు రసాన్ని అల్లంతో కలిపి తీసుకోవడం వల్ల గర్భిణీలను ఇబ్బంది పెట్టె వాంతులు తగ్గుతాయి. అప్పుడే తీసిన చెరుకు రసం జాండిస్ వ్యాధిగ్రస్తులకు మంచిది.
**గుమ్మడికాయ..: సంక్రాంతి రోజున వినియోగించే గుమ్మడికాయలో శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇది శరీరానికి మంచి పుష్తినిస్తుంది. ప్రోస్టేట్ గ్రంధి వాపుతో బాధపడే వారికీ ఉపశమనం కలిగిస్తుంది . 100 గ్రాముల గుమ్మడిలో 92.6 శాతం తేమ, 48.4 శాతం కొవ్వు, 31శాతం ప్రోటీన్లు ఉంటాయి. దీనిలోని క్రిమిసంహారక గుణాలతో కడుపులోని నులిపురుగులు లాంటివి పడి పోతాయి. గుమ్మడి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. గుమ్మడి పండును నిమ్మరసం, తేనెతో కలిపి తీసుకుంటే బలహీనత తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి పిల్లలను చురుగ్గా ఉంచడానికి దోహదపడతాయి. గర్భినిలు, పిల్లలు, వృద్దులు బాదాం పప్పును గుమ్మడి గింజలతో తీసుకోవడం వలన శరీర పుష్టి పెరుగుతుంది. గుమ్మడి ఆకులు గజ్జి,తామరాకు మందుగా పని చేస్తాయి.
**నువ్వులు..: పండుగ రోజున బెల్లం కలిపి చేసుకునే నువ్వుల ఉండలతో శరీరానికి కాల్షియం, ఫోలిక్ఆసిడ్, ఐరన్ అందుతాయి. బాలింతలకు పాలు అధికంగా వస్తాయి. నువ్వుల పొడి మహిళల్లో రుతుస్రావ సమస్యలు, నెలసరి కడుపునొప్పిని నివారిస్తుంది. నువ్వుల్లోని ప్రోటీన్లు, ఫోలిక్ఆసిడ్ రక్త హీనతను నివారిస్తాయి.
**గొబ్బెమ్మలు..: ఆవు మూత్రం, పేడ, పాలు తదితర వాటిలో ఎన్నో ఔషద లక్షణాలు ఉన్నట్లు రుజువైంది. శరీరంలోని టాక్సిన్ లను తగ్గించే గుణం మూత్రంలో ఉంది. పేడతో చేసే గొబ్బెమ్మలు, కల్లాపి యాన్టి వైరల్, బాక్టీరియాగా పనిచేస్తాయి.
**మామిడి ఆకులు.., బంతిపూలు: పండుగరోజు కట్టే మామిడి ఆకులు, బంతి పూల తోరణాలతో ఇంటి అందం పెరగటమే కాదు.. యాంటి బ్యాక్టీరియల్, రిప్పల్లెంట్ గా పనిచేస్తాయి. దోమలతో పాటు బ్యాక్టీరియ ఏంటి దూరంగా ఉంటాయి.
**భోగి మంటలు..: భోగి మంటల్లో ఇంట్లోని పాత వస్తువులు తదితరాలతో పాటు ఉత్తరేణి, దత్తురాలకాడలను వేయడం వలన వచ్చే వాసనను పీల్చడంతో ఉబ్బసం లాంటి జబ్బులు తగ్గుతాయి.—కధనం: పసుపులేటి శ్రీనివాస్ గంపలగూడెం