Fashion

హరిదాసు…ఏమైపోయావు బాసూ!

హరిదాసు…ఏమైపోయావు బాసూ!

అరుదైపోయిన ‘హరిదాసు’ కీర్తనలు.
సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసుగానం. పూర్వం పల్లె, పట్టణం తేడ లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో హరినామ గానం చేస్తూ.. వివిధ కీర్తనలతో హరిదాసులు అలరించేవారు. ఇళ్ళల్లోని వారు ఇచ్చే ధన, ధాన్యాలను స్వయంపాకాలుగా స్వీకరించే సంప్రదాయాలను నేటికి కొనసాగిస్తున్నారు. గత వైభవం లేకున్నా..పట్టణాల్లో ఆదరించకపోయినా కళకు జీవం పోస్తున్నవారు ఎందరో ఉన్నారు.
** ఎలా వచ్చిందీ పద్ధతి…
శ్రీ రాముడు రాజ్యంలో చింతలులేవు. కరవు కాటకాలురావు. దాన ధర్మాలు చేద్దామన్నా పుచ్చుకునేవారే కరువయ్యారని ప్రజలు ధర్మ దేవతను ఆడిపోసుకునేవారట. అది విన్న వేగులు రాముడితో చెప్పగా వారి దాన, ధర్మాలను పుచ్చుకునేందుకు హరినామాన్ని గానం చేసే గాయకులను రాజ్యంలో తిరుగాడేలా చేశారని, వారే నేడు కనిపించే హరిదాసులని చెపుతుంటారు.
**హరిదాసు అనగా..
హరిదాసు అనగా పరమాత్మకు సమానం. మనుషులు ఇచ్చే ధానధర్మాలు అందుకుని వారికీ ఆయురారోగ్యాలు, భోగాభోగ్యలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా భావిస్తారు.—కధనం: పసుపులేటి శ్రీనివాస్ గంపలగూడెం