Agriculture

నిజామాబాద్ కోళ్ల ఫారంలో 2000 కోళ్లు మృతి

నిజామాబాద్ కోళ్ల ఫారంలో 2000 కోళ్లు మృతి

నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని ఓ కోళ్ల ఫారంలో సుమారు 2 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. గత నాలుగైదు రోజుల నుంచి వరుసగా ఒకట్రెండు కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో కోళ్ల ఫారం యజమాని రామచంద్రగౌడ్ అప్రమత్తమై పశుసంవర్ధక శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నాలుగైదు రోజుల క్రితం చనిపోయిన కోళ్ల కళేబరాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఆ రిజల్ట్ ఇంకా రాలేదు. అంతలోపే బుధవారం ఉదయం 2 వేల కోళ్లకు పైగా మృతి చెందడంతో.. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మృతి చెందిన కోళ్లను సమీప అటవీ ప్రాంతంలో గుంత తీసి పూడ్చిపెట్టారు.