Movies

అంతా లోపల లోపలే

అంతా లోపల లోపలే

“ప్రతి అంశాన్నీ ఆచీ తూచీ ఆలోచించి, నిదానంగా మాట్లాడటం నా రక్తంలోనే లేదు. నేను చాలా దుడుకుగా ఉంటాను. చాలా సరదాగా మాట్లాడుతాను. మనసులో ఏమీ ఉంచుకోను. అలాంటి నా స్వభావంలోనూ ఇటీవల మార్పు వచ్చింది’’ అని అన్నారు కియారా అడ్వానీ. తెలుగులో సందీప్‌ వంగా తెరకెక్కించిన ‘అర్జున్‌రెడ్డి’ హిందీ వెర్షన్‌ ‘కబీర్‌ సింగ్‌’లో నటిస్తున్నారు కియారా. ఈ సినిమాలో తాను చేస్తున్న కేరక్టర్‌ గురించి కియారా మాట్లాడుతూ ‘‘సందీప్‌ డిజైన్‌ చేసిన ప్రీతి పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆ పాత్ర ఎక్కువగా మాట్లాడదు. ఓపిక ఎక్కువ. ప్రతి విషయాన్నీ లోలోపల ఆలోచిస్తుంది. ఈ పాత్ర తాలూకు లక్షణాలను నేను చాలా కష్టపడి అలవాటు చేసుకున్నాను. కొన్ని సందర్భాల్లో ప్రీతీలాగే ప్రవర్తిస్తున్నా. ఊహ తెలిసిన తర్వాత నేను అంత కామ్‌గా కూర్చోవడం ఇదే తొలిసారేమో’’ అని అన్నారు కియారా అడ్వాణీ.