Sports

నాకు పరాజయాలు ఇష్టం

నాకు పరాజయాలు ఇష్టం

పరాజయాల నుంచి తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు చెప్పింది. టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడడం నిరాశ కలిగించినా.. తన తప్పుల్ని సరిదిద్దుకునే సమయం దొరికిందని ఆమె పేర్కొంది. ‘‘గతేడాది ఎన్నో పాఠాలు నేర్పించింది. మొదటి పాఠం సహనం. దీనికి కారణం ఏ టోర్నీలు లేకపోవడమే. ఈ సమయంలో మా కుటుంబంతో గడిపేందుకు సమయాన్ని వెచ్చించాను. ఒక స్థాయి క్రీడాకారిణి అయిన తర్వాత ఇంత సమయం వారితో ఉండడం ఇదే తొలిసారి. అంతేకాదు ఇంట్లోనే ప్రాక్టీస్‌ చేసేదాణ్ని. ఈ సమయంలో తప్పులు దిద్దుకున్నా. గతేడాది మార్చి-ఏప్రిల్‌ మధ్య ఒలింపిక్స్‌ సన్నద్ధతలో ఉన్నా. కానీ ఈ క్రీడలు వాయిదా పడడం ఎంతో నిరాశ కలిగించింది. కానీ ఇలా వాయిదా వల్ల నా తప్పులు దిద్దుకునే అవకాశం దొరికిందనే సానుకూల దృక్పథంతో ముందుకు సాగా’’ అని సింధు చెప్పింది. కరోనా విరామనంతరం థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో బరిలో దిగిన సింధు.. తొలి రౌండ్లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.