Movies

ఇంకా అవ్వలేదు

ఇంకా అవ్వలేదు

సోనాల్‌ తన వ్యక్తిగత జీవితం, వివాహం గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నాకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. మన జీవితాల్లో పర్యావరణం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రకృతిని మించి నాకు ఆనందాన్ని ఇచ్చేది మరొకటి లేదు. పక్షుల కిలకిలరావాలు వినడం కోసమే తెల్లవారుజామున నిద్రలేస్తాను. నా వివాహం రెండు చోట్ల జరగాలని ఆశిస్తున్నాను. సాగర తీరం ఓ వేదికగా.. కొండ ప్రాంతం మరో వేదికగా నా వివాహం జరగాలని కోరుకుంటున్నా. అయితే, ఇప్పటివరకూ నాకు కావాల్సిన లక్షణాలున్న జీవిత భాగస్వామి ఎదురవలేదు.’ అని సోనాల్‌ చౌహాన్‌ తెలిపారు.