Movies

దొరస్వామిరాజు మృతి

దొరస్వామిరాజు మృతి

ప్రముఖ సినీ నిర్మాత వి.దొరస్వామి రాజు బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. వి.ఎం.సి ఆర్గనైజేషన్స్ (విఎంసి ప్రొడక్షన్స్, విఎంసి పిక్చర్స్, విఎంసి ఫిల్మ్స్, విఎంసి 1కంపెనీ, విఎంసి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, విఎంసి పిక్చర్ ప్యాలెస్) ఇలా బహుముఖ వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన వ్యవస్థాపకుడు వి.దొరస్వామి రాజు (విడిఆర్). ఆయన చిత్ర నిర్మాత మాత్రమే కాదు. మాజీ ఎమ్మెల్యే కూడా. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఆర్.చెంగారెడ్డి వంటి ఉద్దండ నాయకునిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. టిటిడి బోర్డు సభ్యుడు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, పంపిణీ మండలి అధ్యక్షుడు, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇలా పలు కీలకమైన భూమికలను అత్యంత ప్రతిభతో నిర్వహించారు. సింహాద్రి, అన్నమయ్య, సీతారామయ్య గారి మనవరాలు వంటి గొప్ప చిత్రాలను ఆయన సంస్థ తెరకెక్కించింది. 1978 లో VMC సంస్థను ప్రారంభించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.