Politics

నాంపల్లి కోర్టులో తల్లీకూతుళ్లు-నేరవార్తలు

నాంపల్లి కోర్టులో తల్లీకూతుళ్లు-నేరవార్తలు

* తెలంగాణలోని నాంపల్లి కోర్టుకు వైఎస్ విజయమ్మ, షర్మిల విచారణ నిమిత్తం హాజరయ్యారు. పరకాల ఎన్నికల ప్రచారానికి సంబంధించి కేసులో ప్రస్తుతం న్యాయస్థానం ముందుకు వచ్చారు.

* బి.కొత్తకోట మండలంలోని బడికాయలపల్లెకు చెందిన గులాబ్ జాన్(22) ఆటోలోంచి పడి తీవ్ర గాయాలు…పరిస్థితి విషమం…108 వాహనంలో మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు

* చిత్తూరు జిల్లా.. శ్రీకాళహస్తిరెండు లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం..శ్రీకాళహస్తి అటవీశాఖ సిబ్బందిసమాచారం మేరకు ..శ్రీకాళహస్తి పట్టణం రూరల్ ప్రాంతం దోమ్మరపళ్ళేం నందు అటవీశాఖ అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా …ముచ్చివేలు వైపుగా…TN 20AH2572వాహనం వస్తున్న విషయం గమనించి అటవీశాఖ అధికారులు వాహనం ఆపడానికి ప్రయత్నిస్తుండగా తమిళనాడు రాష్ట్రం తండయార్ పేట కు చెందిన మణికంఠన్ అనే డ్రైవర్ వాహనం వదిలి పారిపోవడానికి ప్రయత్నించడంతో ,అధికారులు అతనిని పట్టుకొని వాహనం తనిఖీ చేయగా ఐదు ఎర్రచందనం దుంగలు దొరికాయని, దాని విలువ దాదాపు రెండు లక్షల రూపాయలు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలియజేశారు,ఈ తనిఖీలలో అటవీ శాఖ క్షేత్ర స్థాయి అధికారి కె వెంకటసుబ్బయ్య,ఆర్. జయశంకర్ ,డి వై ఆర్ వో దామోదరం, రత్నం , మరియు కార్తీక్ పాల్గొన్నారు.

* గవర్నర్ బంగళా ముట్టడి లో భాగంగా వెళుతున్న ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్ ను అడ్డుకోవడానికి చేసిన యత్నం లో ఆయనకు గాయాలు.

* గతంలో జరిగిన రెండు వేర్వేరు హత్యలకు ప్రతీకారం ఆ రెండు హత్య కేసుల నిందితుల్ని వదిలితే తమను ఎక్కడ చంపుతారోననే అనుమానంఈ కారణాలతో రెండు హత్యలకు సిద్ధమై పోలీసులకు చిక్కిన వైనంనాటు బాంబులతో ఇద్దర్ని హతమార్చేందుకు సిద్ధపడిన ముఠాను కళ్యాణదుర్గం పోలీసులు మరియు అనంతపురం సి.సి.ఎస్ పోలీసులు పట్టుకున్నారు.ఆరుగురి నిందితులను అరెస్టు చేశారు. వీరి నుండి 23 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు.గతంలో జరిగిన రెండు వేర్వేరు సమీప బంధువుల హత్యలకు ప్రతీకారంగా ఆ హత్య కేసుల్లోని కీలక నిందితులిద్దర్ని నాటు బాంబులు ద్వారా చంపాలని మరియు ఆ ఇద్దర్ని వదిలితే తమను చంపుతారని అనుమానించి ఈ పథకానికి సిద్ధమైనట్లు విచారణలో వెల్లడైంది. మంగళవారం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు వివరాలు వెల్లడించారు

* కృష్ణా జిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పిల్లి విజయ్ కుమార్ తన అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.

* రాజధాని భూముల్లో ఇన్‍సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం పెట్టిన కేసులను కొట్టేసిన హైకోర్టు .కిలారు రాజేష్‍తో పాటు మరింత మంది రాజధానిలో భూములు ముందుగానే కొని లబ్ధిపొందారని పేర్కొన్న ప్రభుత్వం .భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వం కక్షసాధిస్తోందని క్వాష్ పిటిషన్ వేసిన కిలారు రాజేష్ .

* చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు.తీవ్ర గాయాలపాలైన యువతిని బంధువులు ఆస్పత్రికి తరలించగా… చికిత్స పొందుతూ చనిపోయింది.పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన యువతి గాయత్రి (20) మంగళవారం తమ బంధువుల అమ్మాయితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తోంది.

*