Health

సంతానం కోసం తపిస్తున్నారా? అయితే ఇది మీకోసమే!

సంతానం కోసం తపిస్తున్నారా? అయితే ఇది మీకోసమే!

సంతాన సమస్యల్ని దూరం చేసే టీ..

అశ్వగంధ.. ఈ మూలికలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంతో తయారైన టీని తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరిగి కరోనా వంటి సమస్యలు దూరమవ్వడమే కాకుండా సంతాన సమస్యలు దూరమవుతాయట.. మరి ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి..

అశ్వగంధ.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పురాతన మూలికా ఔషధం గురించి చాలా మందికి తెలుసు. ఇప్పుడు కరోనా మహమ్మారితో పోరాడాల్సిన టైమ్‌లో, రోగనిరోధక శక్తిని పెంచుకోవల్సిన అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఇలాంటి మూలికలపై ఆధారపడాల్సిందే. వ్యాధితో పోరాడడానికి, వాటి నుంచి తప్పించుకోవడానికి బాడీలో ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవాల్సిందే.

ఫ్లూ, ఇతర జ్వరాలతో తప్పించుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దీంతో శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. అయితే, ఈ మూలికను ఇలాంటి సమయంలో మాత్రమే కాకుండా సంవత్సరం మొత్తం తీసుకోవచ్చు. అదెలానో తెలుసుకోండి..

ఒక చెంచా అశ్వగంధ పొడిని నేరుగా మింగడానికి బదులు, మీ రోజును అదే అశ్వగంధతో కిక్‌స్టార్ట్ చేయడానికి సూపర్బ్ హెర్బల్ టీని కూడా తయారు చేసుకోవచ్చు. అశ్వగంధను ఇండియన్ జిన్సెంగ్, వింటర్ చెర్రీ అని కూడా పిలుస్తారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో జరిపిన ఒక అధ్యయనంలో, ఈ అశ్వగంధ మూలిక రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు సైతం చికిత్స చేయగలదు. అంతేకాకుండా, ది ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.., “హైపర్ కొలెస్టెరోలేమియాతో ఇన్సులిన్ ఆధారిత డయాబెటిస్ మెల్లిటస్ రోగులపై జరిపిన క్లినికల్ ట్రయల్స్ లో, WS నోటి హైపోగ్లైసీమిక్‌తో పోల్చినప్పుడు రక్తంలో గ్లూకోజ్ తగ్గుదల కనిపించింది,.”

అశ్వగంధతో లాభాలు..

* ఇది రోగ నిరోధక శక్తి స్థాయిలను పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను మెరుగుపరుస్తుంది.

* అశ్వగంధ ఇన్సులిన్ స్రావాలను పెంచడంలో సాయపడుతుంది. క్రమంగా కండరాల కణాలలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది.

* అశ్వగంధ ఒత్తిడి హార్మోన్‌ను తగ్గిస్తుంది. క్రమంగా అశ్వగంధ తీసుకున్నప్పుడు శరీరం ఉపశమనం పొందడంతోపాటు, తేలికగా అనిపిస్తుంది.

* ఫైటో మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఈ హెర్బ్‌కు ఆందోళనా స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉందని తేలింది.

* ఇది సాధారణ థైరాయిడ్, అడ్రినల్ గ్రంథుల సమస్యలను తగ్గించే ఎండోక్రైన్ వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది.

* ఇది పునరుత్పత్తి హార్మోన్లను సమతుల్యం చేస్తుంది , క్రమంగా సంతానోత్పత్తి రేటును మెరుగుపరుస్తుంది.

* ఇది ఐరన్ రిచ్ గా చెప్పబడింది, క్రమంగా రక్తహీనత ఉన్నవారికి సహాయపడుతుంది.

అశ్వగంధ టీ ఎలా తయారు చేయాలి :

* ఒక సాస్ పాన్లో ఒక కప్పు నీటిని మరగబెట్టండి.

* ఒక టీస్పూన్ అశ్వగంధ పొడి కలపండి. లేదా మీదగ్గర అశ్వగంధ వేర్లు ఉంటే, వాటిలో రెండు వేర్లు వేయండి.

* ఆపై 10 నుండి 15 నిమిషాలు ఉడకనివ్వండి.

* ఇప్పుడు ఒక కప్పులో వడకట్టి, రుచికి సరిపడా, కొంత నిమ్మరసం, తేనెను కలపండి.

జంక్ ఫుడ్ లేదా అనారోగ్యకర భోజనం చేసిన తర్వాత అశ్వగంధ టీ తీసుకోవడం మంచిదని చెబుతారు. ఇది శరీరంలో విషతుల్య పదార్ధాల స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ ప్రక్రియలను కూడా పెంచుతుంది.