Movies

తెగ్గొట్టాలంటే….

తెగ్గొట్టాలంటే….

‘‘ఏ బంధాన్ని అయినా తెంచు కోవాలంటే కష్టం’’ అంటోంది పూజా హెగ్డే. ‘‘ఒక సినిమా అంటే కనీసం ఆరు నెలల ప్రయాణం. అదీ పెద్ద సినిమాలైతే ఈ కాలం మరింతగా ఉంటుంది. ఎంతో మంది కొత్త స్నేహితులవుతారు. కష్ట నష్టాలు కలిసి పంచుకుంటాం. సినిమా చిత్రీకరణ ముగిసి వెళ్లిపోయేటప్పుడు.. మళ్లీ ఆ బృందాన్ని ఎప్పుడు కలుస్తామో తెలియదు. అలాంటప్పుడు వారితో బంధం తెంచుకోవడం కష్టంగా ఉంటుంది.’’ అని చెప్పింది పూజ. ఆమె ప్రభాస్‌తో నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ముగిసింది. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది.