Politics

పోలీసుల అదుపులో ఎంపీ సీఎం రమేష్-తాజావార్తలు

పోలీసుల అదుపులో ఎంపీ సీఎం రమేష్-తాజావార్తలు

* హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్.మంగళగిరి డీజీపీ ఆఫీస్ ముట్టడి కి వెళ్తారన్న సమాచారం తో ఎంపీ సీఎం రమేష్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు.ఎస్కార్ట్ తో విజయవాడ తరలిస్తున్న విజయవాడ సిటీ పోలీసులు.

* కాళోజీ హెల్త్ యూనివర్సిటీ , వరంగల్ 21-1-2021: బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్ అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ. ఈ నెల 22, 23వ తేదీలలో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22న సాయింత్రం 5 గంటల నుంచి 23వ తేదీ సాయింత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లను. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఇతర వివరాలకు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించారు.

* విశాఖ పలు వ్యాపార సముదాయాలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదికారులు గురువారం దాడులు నిర్వహించారు .ఈమేరకు బిర్లా కూడలి వద్ద నున్న డీ మార్ట్ లో అదేవిదంగా ఆర్ .అండ్ .బి కూడలి , సిరిపురం వి.ఐ .పి రోడ్ వద్ద నున్న స్పెన్షర్స్ లో ఎకకాలంలో సోదాలు నిర్వహించారు .దాడులను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదనపు ఎస్పీ జి.స్వరూప రాణి నేరుగా పర్యవేక్షించారు .ఈసందర్బంగా ఆమే మాట్లడుతూ నగరంలో పలు వ్యాపార సముదాయల నిర్వహకులు కాలం చెల్లిన నిత్యవసర వస్తువులు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు వ్యాపార సముదాయల లో రెండు టీం లు గా ఏర్పడి దాడులు నిర్వహించమని పెర్కొన్నారు .

* బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గృహనిర్బంధం.కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద పోలీసులు.డిజిపి కార్యాలయం ముట్టడికి వెళ్లకుండా నిర్బంధం.కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్నా.అందుకు నిదర్శనమే గృహ నిర్బంధాలు.ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో హిందూ ఆలయాల పై దాడులు జరుగుతున్నాయి.దాడులు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం చెప్పలేని పరిస్థితి.ఇలాంటి ప్రభుత్వాన్ని నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు.ఏపీలో పోలీసు వ్యవస్థ చాలా ఆదర్శనీయంగా ఉండేది.కానీ వైకాపా నేతలు చెప్పినట్లు నడుచుకోవాలనటం వల్లే ఈ పరిస్థితి.ప్రభుత్వ చేతకానితనానికి మంత్రులు దూషణలే నిదర్శనం.సంక్షేమ పథకాలు డబ్బులు పంచి మళ్లీ ఎన్నికల్లో గెలవొచ్చని భావిస్తున్నారు.

* రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన ధర్మాసనం.ఎన్నికలు సజావుగా జరగాలన్న హైకోర్టు.పంచాయితీ ఎన్నికలకు ఈనెల 8న షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ.ఎస్ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం.టీకా పంపిణీ వల్ల ఎన్నికలు ఇప్పుడే ఎన్నికలు నిర్వహించలేమన్న ప్రభుత్వం.11 న ఎస్ఈసీ ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు సింగిల్ జడ్జి.సింగిల్ జడ్జి ఆదేశాలపై అప్పీల్ కు వెళ్లిన ఎస్ఈసీ.3 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.ఎవరికి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ధర్మాసనం.హైకోర్టు తాజా తీర్పుపై సుప్రీం కోర్టు కు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం.

* హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో టీకా పరీక్ష, ధ్రువీకరణ (వాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్) కేంద్రం ఏర్పాటుకోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని కేంద్ర వైద్య, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌కు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు.

* హైదరాబాద్ కోకాపేట్ లో ముదిరాజ్ మహాసభలో గంగపుత్రుల హక్కులను హరించే విధంగా వాఖ్యలు చేశారు.గంగపుత్రులకు మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.గంగపుత్రులను అవమానపరుస్తూ.. ముదిరాజ్ లను నెత్తిన పెట్టుకోవడం సమంజసం కాదు.మంత్రి వాఖ్యలు.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గంగపుత్రులకు, ముదిరాజ్ లకు మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉన్నాయి.తలసానికి మత్స్య శాఖ పై అవగాహన లేదు.

* తిరుమలలో ఫిబ్రవరి 19 న రధసప్తమి వేడుకలు నిర్వహించనున్న టీటీడీ.రధసప్తమి వేడుకల్లో ఏడు వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివనున్న గోవిందుడు.ఉదయం సూర్య ప్రభ వాహనంతో మొదలై చద్రప్రభ వాహనంతో ముగియననున్న రధసప్తమి వేడుకలు.రధసప్తమి రోజు దర్శనం టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్న టీటీడీ.మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్యలో జరిగే చక్రస్నాన వేడుకలు ఏకాంతం.

* రాష్ర్టంలోని స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టు కు వెళ్లనుందని రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సజ్జల రామ కృష్ణా రెడ్డి తెలిపారు.తాడేపల్లి లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు తాము ఎప్పుడు భయ పడ లేదని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే తమకే మంచిదని, కానీ ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వద్దు అంటున్నాం అని ఆయన స్పష్టం చేశారు.ఎన్నికల నిర్వహణపై తమ స్టాండ్ ఎప్పుడూ ఒక్కటే అని పేర్కొన్నారు.సీఎం జగన్ కి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది అని, ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తాము సిద్ధమే అని, అలా అని ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టలేము అని వ్యాఖ్యానించారు.రాష్ట్రం లో పోలీసులను వారి విధులకు గాకుండా సొంత పనులకు వాడుకున్న చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు.

* ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఎంతో మహిమాన్విత కలిగిన దేవుడిని కోరిన కోర్కెలను నెరవేర్చే స్వామి వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారుఆయన గురువారం నాడు ద్వారకాతిరుమల స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంగా అతిథి గృహం వద్ద పాత్రికేయులు ఎన్నికలకు సంబంధించిన విషయాలను చెప్పమని కోరినప్పటికీ ఆయన ద్వారకా తిరుమల శ్రీవారి గురించి వెల్లడించారుతిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత మహిమగల స్వామి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆయన చెప్పారు స్వామి వారిని మనస్ఫూర్తిగా దర్శించుకుని ఆయనను ఈ కోరిక అడిగినా తీరుస్తారని నిమ్మగడ్డ వెల్లడించారు

* జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.రెండు రోజుల తిరుపతి పర్యటన నిమిత్తం ఇక్కడికి వచ్చిన ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.తిరుపతిలో నిర్వహించనున్న జనసేన పీఏసీ సమావేశంలో పవన్ పాల్గొననున్నారు.తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న దృష్ట్యా ఈ సారి సమావేశం ఇక్కడ నిర్వహిస్తున్నారు.ఉప ఎన్నికలో పోటీతో పాటు రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.భాజపాతో పొత్తు నేపథ్యంలో అక్కడ ఏ పార్టీ తరఫున అభ్యర్థిని నిలపాలనేది ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు పోటీకి భాజపా ఉత్సాహం చూపుతోంది.ఈ తరుణంలో అక్కడ జనసేన పోటీ చేయాలా.. లేదా.. అన్నది ఈ కార్యక్రమంలో ప్రధాన ఎజెండా కానుంది.అలాగే పంచాయతీ ఎన్నికల విషయంపైనా చర్చించే అవకాశముంది.

* పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును భాజపా నేతలు స్వాగతించారు.ఈ తీర్పు.. శుభ పరిణామమని ఎంపీ సీఎం రమేష్ అన్నారు.సింగిల్ జడ్జి తీర్పు సమయంలో వైకాపా నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారని, ఎన్నికల కమిషనర్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని అన్నారు.ఇప్పుడు ధర్మాసనం తీర్పుతో వారంతా రాజీనామాలు చేస్తారా? అని ప్రశ్నించారు.సుప్రీంకోర్టు సైతం ఎన్నికలు నిర్వహించవచ్చని చాలా సార్లు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు.కోవిడ్ వ్యాక్సినేషన్‌కు, ఎన్నికలకు సంబంధం లేదని సీఎం రమేష్ తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం స్వాగతించారు.ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.

* రెండో దశ కొవిడ్​ వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో ప్రధాని సహా ముఖ్య నేతలకు టీకా వేస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.50 ఏళ్ల వయస్సు పైబడిన వారికీ టీకా అందజేస్తామని స్పష్టం చేసింది.వ్యాక్సినేషన్​పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది.ప్రధాని సహా దేశవ్యాప్తంగా ముఖ్య నేతలకు రెండోదశలో కొవిడ్ టీకాలు వేస్తామని పేర్కొంది.తొలి దశ వ్యాక్సినేషన్‌లో 3 కోట్ల మందికి కొవిడ్ టీకాలు వేయాలని నిర్దేశించుకోగా.. ఇప్పటివరకు 7లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడించింది.రెండో దశలో తొలిరోజు ప్రధాని, సీఎంలకు టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.50 ఏళ్లు పైబడిన వారితో పాటుగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీకాలు వేస్తామని చెప్పింది.ఈ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.