DailyDose

తప్పు అయింది…క్షమించమంటున్న ఎమ్మెల్యే-నేరవార్తలు

తప్పు అయింది…క్షమించమంటున్న ఎమ్మెల్యే-నేరవార్తలు

* అయోధ్య రాముడిపై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేఅయోధ్య రాముడిపై చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు వెనక్కి తగ్గారు.తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించాలని..తన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించారని విద్యాసాగర్‌ పేర్కొన్నారు. తానూ రాముడి భక్తుడినేనని…అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి విరాళాలూ ఇస్తానని వెల్లడించారు.కాగా..ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు అయోధ్య రామమందిరంపై నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో కట్టే రామ మందిరానికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.మన ఊళ్లోనే గుళ్లు కట్టుకుందామని పిలుపునిచ్చారు. అసలైన భక్తులం తామేనని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలే భక్తి లేని వాళ్లంటూ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో కులాల వారీగా కూడా దేవుళ్లు ఉన్నారని గుర్తుచేశారు.ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇబ్బందులు పడుతుంటే కేంద్రం ఆదుకోలేదన్నారు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. అయితే… విద్యాసాగర్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేసింది. దీంతో విద్యాసాగర్‌ రావు తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.

* హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. లక్షలు వసూలు చేసిన ముఠా పట్టివేత* నకిలీ ఆర్డర్ కాఫీలతో అమాయక నిరుద్యోగులను మోసం చేసిన వైనం* అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలువురు నిరుద్యోగులను వంచించిన ముఠాహోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. లక్షలు వసూలు చేసిన ముఠాను నార్పల పోలీసులు పట్టుకున్నారు.ఈ ముఠాకు చెందిన ముగ్గుర్ని అరెస్టు చేసి వీరి నుండీ ఒక CPU, 500 GB హార్డ్ డిస్క్, DELL కంపెనీకి చెందిన మానిటర్, కీ బోర్డు మరియు మౌస్ లు,2 సెల్ ఫోన్ లు, నకిలీ నియామక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.నకిలీ ఆర్డర్ కాఫీలతో అమాయక నిరుద్యోగులను మోసం చేస్తున్న వైనం బట్ట బయలయ్యింది.అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలువురు నిరుద్యోగులను వంచించినట్లు విచారణలో వెల్లడైంది.ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు వివరించారు.అరెస్టయిన నిందితులు:1)డేరంగుల వెంకటేష్, వయస్సు 27 సం,, లు అంకిరెడ్డి పల్లి గ్రామం, కొలిమిగుండ్ల మండలం, కర్నూల్ జిల్లా,2)తొక్కల సాయికిరణ్, వయస్సు 26 సం., నొస్సo గ్రామము, సంజామల మండలం, కర్నూల్ జిల్లా.3)చక్కెర వెంకట సుబ్బయ్య, వయస్సు 30 సం., నొస్సo గ్రామం, సంజామల మండలం, కర్నూల్ జిల్లా.

* కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మక్కపేటలో విగ్రహాల ధ్వంసం కేసులో ఏడుగురు నిందితులను సిట్​ అధికారులు అరెస్ట్​ చేశారు.

* మేఘాలయాలోని ఓ గనిలో ఘోర ప్రమాదం జరిగింది. తవ్వకాలు జరుపుతుండగా ఆరుగురు కార్మికులు పెద్ద గుంతలో పడి మరణించారు. వీరంతా అసోం వాసులుగా గుర్తించారు.