NRI-NRT

తానాలో మోగిన ఎన్నికల నగారా-TNI ప్రత్యేకం

TANA Elections 2021 Schedule Tentatively Announced In Board Meeting

అమెరికాలో పెద్ద కోడిపందేల జాతరకు రంగం సిద్ధమవుతోంది. అతిపెద్ద తెలుగు సంఘం తానాలో నూతన కార్యవర్గం ఎన్నికలకు నగారా మోగనున్నది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం జరిగిన బోర్డు సమావేశంలో తానా ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేశారు.

* జనవరి 31వ తేదీన ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
* ఫిబ్రవరి 14 నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై 22 వరకు
* మార్చి 15 నుండి బ్యాలెట్ పేపర్ల పోస్టల్ పంపిణీ
* మే14 వరకు పోస్టల్ బ్యాలెట్ల స్వీకరణ
* మే 15, 16 తేదీల్లో ఓట్ల లెక్కింపు
* మే16న నూతన కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం

తానా బోర్డ్ సమావేశంలో ఎన్నికల తేదీలపై ప్రాధమికంగా చర్చలు జరిగినప్పటీకీ ఈ తేదీల్లో స్వల్ప మార్పులు కూడా చేపట్టవచ్చు. జనవరి నెలాఖరులో మాత్రం తప్పనిసరిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.