DailyDose

దుర్గమ్మ వెండి దొంగలు దొరికారు-నేరవార్తలు

దుర్గమ్మ వెండి దొంగలు దొరికారు-నేరవార్తలు

* బెజవాడ దుర్గమ్మ వెండి సింహాల చోరీ కేసును చేధించిన పోలీసులు.విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు.బెజవాడ కనకదుర్గమ్మ రథానికి ఉండాల్సిన నాలుగు వెండి సింహల్లో మూడు చోరీకి గురైనట్లు 2020 సెప్టెంబర్ 17న ఫిర్యాదు నమోదయింది.దీనిపై ఏర్పాటుచేయబడిన ప్రత్యేక దర్యాప్తు బృందం దాదాపు 140 మందిని విచారించి, అన్ని కోణాల్లో సమగ్రమైన దర్యాప్తు జరిపింది.చోరీ ఎప్పుడు జరిగిందో నిర్దిష్టంగా తెలీకపోవడం, ఆధారాలు లభించకపోవడం, సీసీ టీవీ ఫుటేజ్ 15వ రోజులకు మించి అందుబాటులో లేకపోవడం దర్యాప్తు క్లిష్టంగా మారింది.అనేక మంది పాత నేరస్తులను విచారించిన అనంతరం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జక్కంపూడి సాయిబాబా వెండి సింహాల చోరీకి పాల్పడినట్లు గుర్తించాం.దుర్గగుడిలో దొంగిలించిన వెండి సింహాలను తణుకు తీసుకెళ్లి, ముత్త కమలేష్ అనే బంగారు వ్యాపారికి విక్రయించాడు.నిందితులు సాయిబాబా, కమలేష్ లను అరెస్టు చేసి అమ్మవారి వెండి సింహాలకు చెందిన 9 కిలోల వెండితో సహా మొత్తం 15.4 కిలోల వెండి దిమ్మెలను స్వాధీనం చేసుకున్నాం.ఇటువంటి సున్నితమైన అంశాలపై ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, మీడియా సంయమనంతో వ్యవహరించాలి.కమిషనరేట్ పరిధిలో దేవాలయాల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాం. దేవాలయాలపై దాడులకు పాల్పడేవారిని అడ్డుకోవడంలో ప్రజల సహకారం కీలకం.వెండి సింహాల చోరీ కేసును చేధించిన ఏసీపీ హనుమంతరావు, సీఐ పి.వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ లకు రివార్డులు అందిస్తాం.

* కరోనా వ్యాక్సిన్ వేయించుకొన్న ఆశా వర్కర్ అపస్మారక స్థితికి…..గుంటూరు లో ఈ నెల 19 న కరోనా వ్యాక్సీన్ వేయించుకొన్న ఆశా వర్కర్ విజయలక్ష్మి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్ళింది… చికిత్స అందిస్తున్న వైద్యులు.

* చిత్తూరు జిల్లాబంగారు పాళెం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు..ఏసీబీ వలలో చిక్కిన విఆర్ఓ నాగరాజు నాయుడు.భూమి పాస్ బుక్ కోసం వెంకటేష్ అనే రైతు వద్ద రో.5 వేలు డిమాండ్ చేసిన విఆర్ఓ నాగరాజు నాయుడు.లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించిన రైతు వెంకటేష్.రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విఆర్ఓ నాగరాజు నాయుడు.

* రామతీర్ధం ఘటనలో విజయసాయిరెడ్డి కారుపై దాడి చేసి అద్దం పగలగొట్టారనే ఆరోపణతో టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావుపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసు విషయంలో హైకోర్టును కళావెంకట్రావు ఆశ్రయించారు. కొద్ది రోజుల క్రితం కళావెంకట్రావును అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు. తనపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండ ఆదేశించాలని కళావెంకట్రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. తదుపరి తమ విచారణకు వచ్చే వరకు కళావెంట్రావుపై ఏ విధమైన బలవంతపు చర్యలు చేపట్ట కూడదని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.