NRI-NRT

2021-22 టాటా నూతన కార్యవర్గం

Telangana American Telugu Association TATA 2021-22 EC

2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (టిటిఎ) నూతన కార్యవర్గ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ ను ఆదివారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం వ్యవస్థాపకుడు డా.పైళ్ల మల్లారెడ్డి సమక్షంలో అడ్వైసరీ చైర్మన్ డా.విజయపాల్ రెడ్డి, కో-చైర్ డా.హరనాథ్ పొలిచెర్లుల ఎన్నిక పత్రాన్ని విడుదల చేశారు.

నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా డా.మోహనరెడ్డి పటలోళ్ళ, ఉపాధ్యక్షులుగా వంశీ రెడ్డి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులుగా సురేష్ వెంకన్నగారి, జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్ మనప్రగడ, జాయింట్ సెక్రటరీగా కవిత రెడ్డి కంతాల, కోశాధికారిగా పవన్ రవ్వ, జాయింట్ కోశాధికారిగా హరిందర్, కార్యనిర్వాహక డైరెక్టర్ గా వెంకట్ గడ్డం, నేషనల్ కో ఆర్డినేటర్ గా వెంకట్ ఎక్క, ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా నవీన్ గోలి, మీడియా మరియు కమ్యూనికేషన్ డైరెక్టర్ గా డా” నరసింహరెడ్డి దొంతిరెడ్డి మరియు ఎథిక్స్ కమిటీ చైర్ గా మాధవి సోలేటి ఎన్నికయ్యారు. అడ్వైసరి చైర్మన్ డా.విజయపాల్ రెడ్డి నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు మరో 20 మందితో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బోర్డు సభ్యుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘాన్ని, తెలంగాణ ప్రజల ఉనికిని విశ్వవ్యాప్తం చేస్తానని నూతన అధ్యక్షుడు పటలోళ్ళ మోహనరెడ్డి పేర్కొన్నారు.
2021-22 టాటా నూతన కార్యవర్గం
2021-22 టాటా నూతన కార్యవర్గం