Agriculture

ఎర్రకోట ఎక్కిన రైతులు-తాజావార్తలు

Farmers Post Flag On Top of Red Fort In Delhi

* కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌ తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. పోలీసులు అనుమతించిన రూట్‌ మ్యాప్‌ను పక్కనపెట్టి రైతులు ఎర్రకోట వైపు దూసుకెళ్లడం కలకలం రేపింది. ఎర్రకోట బురుజులపైకి ఎక్కిన రైతులు అక్కడే జెండాలతో నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో కేంద్రం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. రాత్రి 12గంటల వరకు టెలికాం, ఇంటర్నెట్‌ సేవలు నిలుపుదల చేస్తున్న్టట్టు వెల్లడించింది. శాంతిభద్రతల దృష్ట్యా సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌, ముఖుర్దాచౌక్‌, నగ్లోయ్‌ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

* కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌ తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారింది. పోలీసులు అనుమతించిన రూట్‌ మ్యాప్‌ను పక్కనపెట్టి రైతులు ఎర్రకోట వైపు దూసుకెళ్లడం కలకలం రేపింది. ఎర్రకోట బురుజులపైకి ఎక్కిన రైతులు అక్కడే జెండాలతో నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో కేంద్రం ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది. రాత్రి 12గంటల వరకు టెలికాం, ఇంటర్నెట్‌ సేవలు నిలుపుదల చేస్తున్న్టట్టు వెల్లడించింది. శాంతిభద్రతల దృష్ట్యా సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌, ముఖుర్దాచౌక్‌, నగ్లోయ్‌ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

* దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. నగరంలో ఐటీవో ప్రాంతంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఓ రైతు మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల లాఠీఛార్జి వల్లే అతడు చనిపోయాడని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే, దీన్ని దిల్లీ పోలీసులు ఖండించారు. ఆందోళన సమయంలో ట్రాక్టర్‌పై నుంచి ప్రమాదవశాత్తు పడటం వల్లే రైతు మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ రైతులు ఆందోళన కొనసాగుతుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

* రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎన్నికల విధులు, ఓట్లర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, నామినేషన్ల ఏర్పాట్లపై సీఎస్‌ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.

* వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌ దిల్లీలో రణరంగంగా మారింది. పోలీసులు అడుగడుగునా అడ్డుకొనేందుకు ప్రయత్నించినా రైతులు ఎర్రకోట ఎక్కి నిరసన తెలిపారు. దీంతో ఈ నిరసనలు రైతు నేతల చేయి దాటిపోయాయంటూ వస్తున్న ఆరోపణలపై బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ స్పందించారు. తమ ర్యాలీలోకి ఇతరులు చొరపడ్డారన్నారు. పరేడ్‌ను చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు చొరబడ్డారని, తమ ర్యాలీలోకి చొరబడినవారిని గుర్తించినట్టు చెప్పారు.

* స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటు పడాలని ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ప్రజలను కోరారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. సేవాభావంతో ఎన్టీఆర్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేశారని తెలిపారు. కరోనా విపత్కాలంలోనూ వైద్యులు అంకితభావంతో నాణ్యమైన సేవలు అందించారని కొనియాడారు. కరోనాతో పోరాడి మృతిచెందిన వారికి బాలకృష్ణ నివాళులు అర్పించారు.

* నూతన సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. కాసేపు సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణమంతా కేసీఆర్‌ కలియతిరిగారు. నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజినీర్లు, గుత్తేదారుల ప్రతినిధులతో మాట్లాడారు. ఎక్కడా రాజీపడకుండా నిర్మాణ పనుల్లో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ ప్రధాన గేట్‌తో పాటు ఇతర గేట్లు అమర్చే ప్రాంతాలు, భవన సముదాయం నిర్మించే ప్రాంతం, వాటి డిజైన్లను కేసీఆర్‌ పరిశీలించారు.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్‌లో ర్యాలీ ప్రారంభమైంది. అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని సరూర్‌నగర్‌ నుంచి ఉప్పల్‌ వరకు వాహనాలతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ర్యాలీలో వామపక్షాల నేతలు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటలకు ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు వద్ద ముగియనుంది. వాహన ర్యాలీ సాగుతున్న మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

* దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌ విభజనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఎటువంటి ప్రణాళిక లేదని, విభజన కంటే కలిసి ఉండడాన్నే తమ ప్రభుత్వం బలంగా నమ్ముతుందని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్‌పీ ప్రభుత్వం 2011లోనే ప్రతిపాదించిన విషయం తెలిసిందే. బుందేల్‌ఖండ్‌, పూర్వాంచల్, అవద్‌ ప్రదేశ్‌, హరితప్రదేశ్‌గా విభజించాలని అప్పటి అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే, తాజాగా ఓ సమావేశంలో రాష్ట్ర విభజనపై యూపీ ముఖ్యమంత్రిని అడిగిన ప్రశ్నకు.. ‘తమకున్న చరిత్రపై ఉత్తరప్రదేశ్‌ ప్రజలు ఎంతో గర్వపడుతారు. రాష్ట్రానికి దేశంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఐక్యంగా ఉండడాన్నే మేము విశ్వసిస్తాం, విజభనను కాదు’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

* నేరస్థులు ముఖ్యమంత్రి అయి..న్యాయవ్యవస్థపైనే దాడిచేసే పరిస్థితికి వచ్చారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నేరస్థులు కోర్టులనే బెదిరించే పరిస్థితి వచ్చేసిందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించే ముఖ్యమంత్రి అయితే హైకోర్టు తీర్పు చూసైనా పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండేవారు కాదని ఎద్దేవా చేశారు. న్యాయమూర్తులు మారినా న్యాయం మారదని మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. ఉద్యోగులపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ముఖ్యమంత్రే బాధ్యుడన్నారు. వాళ్లకు రావాల్సిన హక్కులపై పోరాడకుండా రాజకీయాలతో ఉద్యోగులకు పనేంటని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యతిరేక పాలన జరిగితే పరిరక్షణ బాధ్యత గవర్నర్‌ తీసుకోవాలన్నారు.

* అయోధ్యలో చేపడుతున్న రామ మందిర నిర్మాణానికి మాజీ కేంద్ర మంత్రి, తెదేపా సీనియర్‌ నాయకుడు అశోక్‌ గజపతి రాజు మంగళవారం ఉదయం విరాళం అందజేశారు. ఈ మేరకు రూ.1,11,116ల చెక్కును శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ప్రతినిధులకు ఆయన అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

* రామోజీ ఫిల్మ్‌సిటీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

* కర్నల్‌ సంతోష్‌బాబుకు కేంద్రం మహా వీరచక్ర పురస్కారం ప్రకటించింది. గతేడాది గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి ఆయన వీరమరణం పొందారు. సంతోష్‌బాబు సేవలను స్మరిస్తూ మరణానంతరం మహావీరచక్ర పురస్కారాన్ని ఆయనకు కేంద్రం ప్రకటించింది. సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు.. 16 బిహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సమయంలో గల్వాన్‌ లోయ వద్ద చైనా సైన్యం దురాక్రమణకు యత్నించగా.. భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. జూన్‌ 15న జరిగిన ఈ ఘటనలో సంతోష్‌బాబుతో పాటు 21 మంది సైనికులు వీరమరణం పొందారు.