Politics

పార్లమెంటులో వైకాపా పోరాటం

పార్లమెంటులో వైకాపా పోరాటం

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో వైకాపా పోరాడుతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం సవరణలు ప్రతిపాదిస్తామన్నారు. మరోవైపు పోలవరం అంచనాలపై ఆమోదానికి కూడా సవరణలు ప్రతిపాదిస్తామని చెప్పారు. గతంలో ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రైవేటు మెంబర్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారని, దీనిపై చర్చ జరిగిన తర్వాత, ఆర్థిక బిల్లుగా పరిగణించి భాజపా పక్కకు తప్పించిందని అన్నారు. దీంతో లోక్‌సభలో వైకాపా మరో ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. కరోనా దృష్ట్యా అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ ఉండాలని, అవసరమైతే ఎక్కువ అప్పులు తెచ్చి ద్రవ్య చెలామణి పెంచాలని అన్నారు. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. తెలుగు దేశం అధినేతపై చర్యలకు మాత్రం వెనకడుగు వేస్తున్నారని ఆక్షేపించారు.