Movies

అందుకే చేసుకున్నాను

అందుకే చేసుకున్నాను

రణ్‌వీర్‌-దీపిక.. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ జంట. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్‌లీలా’ చిత్రీకరణలో మొదటిసారి పరిచయమైన వీరిద్దరూ అదే సమయంలో ప్రేమలో పడ్డారు. ఏడేళ్ల డేటింగ్‌ తర్వాత ఈ జంట 2018లో నవంబర్‌ 14న వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కాగా, రణ్‌వీర్‌ కపూర్‌ను వివాహం చేసుకోడానికి గల కారణం గురించి ఇటీవల దీపికాపదుకొణె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫేమ్‌, సంపాదనపరంగా రణ్‌వీర్‌ కంటే తాను ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ అతను మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండేవాడని.. ఒకేవిధంగా గౌరవించేవాడని.. అదే ఏడడుగుల బంధంలోకి వెళ్లేలా చేసిందని.. ఆమె తెలిపింది.