Health

అమెరికాలో దక్షిణాఫ్రికా బ్రెజిల్ రకం కరోనా

అమెరికాలో దక్షిణాఫ్రికా బ్రెజిల్ రకం కరోనా

బ్రిటన్‌లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్‌ ఇప్పటికే 82 దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ కూడా దాదాపు 40దేశాల్లో విస్తరించగా, బ్రెజిల్‌ రకం తొమ్మిది దేశాలకు వ్యాపించిందని డబ్ల్యూహెచ్‌ఓ కొవిడ్-19 సాంకేతిక విభాగాధిపతి మారియా వ్యాన్‌ కెర్ఖోవ్‌ పేర్కొన్నారు. అమెరికాలో మొత్తం 471 కొత్తరకం కేసులు బయటపడగా, వీటిలో 467 కేసులు బ్రిటన్‌ రకం, మూడు కేసులు దక్షిణాఫ్రికా రకం, మరోకేసు బ్రెజిల్‌ రకం వైరస్‌ నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. భారత్‌లోనూ బ్రిటన్‌ రకం వైరస్‌ కేసుల సంఖ్య 150దాటాయి.