Politics

దర్శనానికి వెళ్లినందుకు తితిదే జేఈఓను తప్పించిన జగన్ సర్కార్-తాజావార్తలు

YS Jagan Administration Moves TTD Jeo Basanth Kumar

* తిరుపతి జేఇఓ బసంత్ కుమార్ పై బదిలీ వేటు..నిన్న ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో పాల్గోన్న బసంత్ కుమార్..తన పరిధిలో లేక పోయినా బసంత్ కుమార్ ఎన్నికల కమిషనర్ పర్యటనలో పాల్గోనడం పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్..జిఏడి లో రిపోర్టు చేస్తూ.. ఎన్నికలకు నెల్లూరు జిల్లా అబ్జర్వర్ గా కోనసాగవచ్చు అంటూ ఆదేశాలు జారీ చేసిన సి.ఎస్.

* తెలంగాణ ఎంసెట్‌పై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సమక్షంలో ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు శుక్రవారం సమావేశమయ్యారు. ఎంసెట్‌లో ఇంటర్‌ తొలి ఏడాది నుంచి 100శాతం సిలబస్‌ ఉంటుందని తెలిపిన విద్యాశాఖ అధికారులు ద్వితీయ ఏడాది నుంచి 70 శాతం సిలబస్‌ ఉండనుందని తెలిపారు. సాయంత్రం టీఎస్‌ ఎంసెట్‌ సిలబస్‌ విడుదల చేయనున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ వెల్లడించారు. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజి యథాతథంగా ఉంటుందని తెలిపారు.

* త్వరలో తెలంగాణ ప్రభుత్వ బ్రాండ్ తో నాణ్యమైన మాంసం విక్రయాలు ప్రారంబిస్తాం….మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి

* ఈ నెల 7న(ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

* రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్‌ఈసీ తయారు చేసిన యాప్‌నకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేషన్ వచ్చేంతవరకు నిలిపివేయాలని న్యాయస్థాన ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. కాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ- వాచ్‌ పేరుతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఓ యాప్‌ను విడుదల చేశారు. దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. అయితే ప్రైవేటు యాప్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ- వాచ్‌కు సెక్యూరిటీ సర్టిఫికెట్‌ ఉందా అని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, 5 రోజుల్లో తీసుకువస్తామని సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఈ యాప్‌ను ఉపయోగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

* ఈ నెల 7న(ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జర‌గ‌నుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను ఆహ్వానించారు.

*బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ శుక్రవారం సుప్రీం కోర్టులో తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. సీజేఐ జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సోనుసూద్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ముంబైలోని జూహు ప్రాంతంలోని ఆయన నివాసంలో అక్రమ నిర్మాణాలపై బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని ఆయన జనవరి 31న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఈ సందర్భంగా పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని క్లయింట్‌కు సూచించాలని సీనియర్‌ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గికి ధర్మాసనం సూచించింది. ఈ మేరకు ఆయన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. జుహులోని ఆరు అంతస్తుల ‘శక్తి సాగర్‌’ భవనాన్ని హోటల్‌గా మార్చడంపై మహారాష్ట్ర రీజియన్ అండ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ (ఎంఆర్‌టీపీ యాక్ట్) కింద బీఎంసీ జనవరి 4న జుహు పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారనే ఆరోపణలతో సూద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బీఎంసీ తన ఫిర్యాదులో కోరింది. దీంతో ఆయన స్థానిక కోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను తిరస్కరించింది. మళ్లీ గత నెలలో బాంబే హైకోర్టును ఆశ్రయించగా కొట్టివేసింది.

*వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళ‌న‌లు ఒక్క రాష్ట్రానికే ప‌రిమిత‌మ‌ని కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ పార్ల‌మెంటులో వ్యాఖ్యానించారు. కొంద‌రు బ‌ల‌వంతంగా రైతుల చేత‌ ఆందోళ‌న చేయిస్తున్నార‌ని మంత్రి విమ‌ర్శించారు. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో రైతుల ఆందోళ‌న 72వ రోజుకు చేరగా.. రాజ్య‌స‌భ‌లో మంత్రి తోమ‌ర్ చేసిన తాజా వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

*తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణకు మరోసారి బ్రేక్ పడింది. వివేకా హత్య కేసుకు సంబంధించి ముందు కేసు వివరాలను ఇవ్వాలని పులివెందుల కోర్టును సీబీఐ బృందం కోరింది. క్రింది స్థాయి అధికారులకు కీలక ఆధారాలు ఇచ్చేందుకు వీలులేదని చెప్పడంతో సీబీఐ అధికారులు వెనుదిరిగారు. కేసు మొత్తం డాక్యుమెంట్ల కోసం విచారణ స్థాయి అధికారి మాత్రమే పిటీషన్ వేయాలని పీపీ స్పష్టం చేసింది. గతంలో సిట్ బృందం దాఖలు చేసిన కేసు వివరాల డాక్యుమెంట్ల కోసం సీబీఐ ఇన్స్‌పెక్టర్ అమిత్రాధి నిన్న పులివెందుల కోర్టుకు వచ్చారు. వివేకా హత్య కేసులో సిట్ దాఖలు చేసిన ఆధారాల పత్రాలను అందజేయాలంటూ పులివెందుల కోర్టుకు హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఉన్నతాధికారి లేకుండా కీలక ఆధారాలు ఇవ్వలేమని పులివెందుల కోర్టు చెప్పడంతో సీబీఐ అధికారులు డిల్లీకి తిరుగు పయనమయ్యారు.

*ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖత్వానికి మానవరూపం జగన్ రెడ్డి అని తీవ్రస్థాయిలో విమర్శించారు. మహనీయుల విగ్రహాలు కూలుస్తూ జగన్ రెడ్డి మరింత దిగజారిపోయారన్నారు.