Movies

అన్షు అంబానీ గుర్తుందా?

అన్షు అంబానీ గుర్తుందా?

దాదాపు 17 ఏళ్ల తర్వాత అన్షూ అంబానీ వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. త్రివిక్రమ్‌-తారక్‌ కాంబోలో తెరకెక్కనున్న సరికొత్త చిత్రంలో అన్షూ కీలక పాత్రను పోషించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. #NTR30గా పట్టాలెక్కనున్న ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి వరీన హుస్సేన్‌ రెండో కథానాయికగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.