Politics

హైదరాబాద్ మేయర్ రేసులో కేకే vs పీజేఆర్

హైదరాబాద్ మేయర్ రేసులో కేకే vs పీజేఆర్

ఈనెల 11న జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటి మేయర్‌ ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి మేయర్ పదవి మహిళలకు దక్కనుంది. అయితే ఈ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మేయర్ పదవికి పరిశీలనలో గద్వాల విజయలక్ష్మి, విజయారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విజయలక్ష్మి.. రాజ్యసభ సభ్యుడు కేకే కుమార్తె కాగా విజయారెడ్డి పీజేఆర్ కుమార్తె. ఇక డిప్యూటి మేయర్ రేసులో జగదీశ్వర్ గౌడ్, హమీద్ పటేల్, బాబా ఫసియుద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి. సీల్డ్ కవర్‌లో మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను సీఎం కేసీఆర్ పంపనున్నారు.