Politics

వై.ఎస్. ప్రత్యేక తెలంగాణా వ్యతిరేకి

వై.ఎస్. ప్రత్యేక తెలంగాణా వ్యతిరేకి

షర్మిల కొత్త పార్టీపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. మంగళవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. షర్మిల పార్టీ పెట్టడం జగనన్న డైరెక్షన్‌లో జరిగిందా.. లేదా అనేది త్వరలో తేలుతుందన్నారు. దివంగత వైఎస్ తెలంగాణకు వ్యతిరేకమని, సమైక్య ఏపీకి అనుకూలమని… ఈ విషయం తెలంగాణలో అందరికీ తెలుసన్నారు. వైఎస్ పేరు లేకుండా షర్మిల లేదన్నారు. షర్మిల పార్టీకి తెలంగాణలో ఓట్లు రావడం కష్టమని వ్యాఖ్యానించారు. తమిళనాడు లేదా కర్నాటకలో పార్టీ పెడితే ఎక్కువ ఓట్లు వస్తాయని సూచించారు. వైఎస్ జగన్‌కు సంబంధం లేకుండా షర్మిల తీసుకున్న నిర్ణయమని, అన్నకు ఇబ్బంది లేకుండా షర్మిల సొంతంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. వైఎస్ జగన్ జైళ్లో ఉన్నప్పుడు పార్టీ కోసం చాలా కష్టపడిందని రఘురామకృష్ణ రాజు అన్నార
‘‘అన్నాచెల్లెళ్ల మధ్య అద్భుతమైన అనుబంధం ఉంది. రక్తసంబంధం సినిమాలో రామారావు-సావిత్రి కంటే కూడా ఎక్కువ అనుబంధం వారిమధ్య ఉంది. దీనిలో మరో అనుమానం అక్కర్లేదు. నిజంగా ఇద్దరి మధ్యా వైరం ఉంటే, ఏపీలో పెట్టకుండా.. తెలంగాణలో ఎందుకు పెడతారు? బ్రదర్ అనిల్ విల్లు అయితే.. షర్మిల బాణం అవుతుంది… ఇక్కడ పోరాడతారు’’ అని రఘురామరాజు అన్నారు.