WorldWonders

మార్చిలో భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం

మార్చిలో భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం

2020లో కరోనా వచ్చినప్పుడైతే ఈ ఊహాగానాలకు అంతులేకుండా పోయింది. అయితే అనూహ్యంగా కరోనాను మానవాళి జయించడంతో ఈ అంచనాలన్నీ తప్పిపోయాయి. దీంతో తాజాగా వచ్చే నెల్లో భూగోళానికి పెను ముప్పు పొంచి ఉందని అమెరికాలో అబద్ధపు ప్రచారం మొదలైంది. మార్చిలో ఇప్పటివరకు చూడనంత పెద్ద ఆస్టరాయిడ్‌(గ్రహశకలం) భూమికి సమీపంలోకి రానున్న తరుణంలో కొన్ని ఫేక్‌ సైట్లు ఈ శకలం భూమిని ఢీకొట్టబోతోందంటూ ప్రాపగాండా చేస్తున్నాయి. అయితే సైంటిస్టులు అలాంటిదేమీ లేదని భరోసా ఇస్తున్నారు. మార్చి 21న భారీ ఆస్టరాయిడ్‌(పేరు:2001 ఎఫ్‌ఓ32) భూమికి సమీపంలోకి రానున్నమాట వాస్తవమేనని, కానీ భూమిని ఢీకొట్టడమనేది అబద్ధమని చెబుతున్నారు. ఈ ఆస్టరాయిడ్‌ పలు ఎన్‌ఈఓ(నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్స్‌)ల్లో ఒకటని, ఇవన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయని వివరించారు.