DailyDose

శ్రీచైతన్య అధ్యాపకుడి ఆత్మహత్య యత్నం-నేరవార్తలు

శ్రీచైతన్య అధ్యాపకుడి ఆత్మహత్య యత్నం-నేరవార్తలు

* దిల్‌సుఖ్ నగర్ లోని శ్రీ చైతన్య కళాశాల వద్ద అదే కళాశాలకు చెందిన సీనియర్ జువాలజి లెక్చరర్ హరినాథ్ ఆత్మహత్యకు ప్రయత్నించగా అడ్డుకున్న సహచర ఉద్యోగులు మరియు చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. విషయం తెలుసుకున్న BJP జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు సభ్యులు పేరాల శేఖర్ రావు, విశ్వహిందూ పరిషత్ (VHP ) రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, తెలంగాణా లెక్చరర్స్ ఫోరం (TLF ) రాష్ట్ర అధ్యక్షులు మురళీ మనోహర్ గార్లు వివిధ కళాశాలల లెక్చరర్స్ తో పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి లెక్చరర్స్ ను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. విద్యార్థులు మరియు లెక్చరర్స్ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న కార్పోరేట్ కళాశాలలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని, తల్లి దండ్రుల నుండి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కార్పోరేట్ కళాశాలలు అధ్యాపకులకు మాత్రం జీతాలు చెల్లించడం లేదని, సీనియర్ లెక్చరర్స్ అందరిని ఉద్యోగాల నుండి తొలగించి అర్హత లేని వారితో స్టడీ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్ధుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్నారని , పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్స్ రోడ్లపై ధర్నాలు చేస్తూ, ఆత్మహత్యా యత్నాలు చేస్తుంటే విద్యా శాఖ మంత్రి గానీ , ఉన్నతాధికారులు గానీ , ఇంటర్ బోర్డు అధికారులు గానీ కనీసం స్పందించక పోవడం సిగ్గు చేటైన విషయమని , ఇదేనా బంగారు తెలంగాణా ? అని విద్యా మాఫియాను అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమని తెలిపారు. లెక్చరర్ ఆత్మహత్యా యత్నానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హామి ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

* హైదరాబాద్ ఘట్కేసర్ ఘటనలో విద్యార్థిని పై అత్యాచారం జరగలేదని క్యూర్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సీనియర్ గైనకాలజిస్ట్ అన్ని వైద్య పరీక్షలు చేశారని, కేవలం అత్యాచార ప్రయత్నమే జరిగిందని డాక్టర్ రణధీర్ రెడ్డి వెల్లడించారు.

* దిశ కేసు మరో మలుపు తిరుగుతోంది. కేసులో నలుగురే కాదు..ఇంకొందరి ప్రమేయం ఉందంటున్నాయి ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలు. దిశ కమిషన్ ముందు హాజరైన కుటుంబ సభ్యులు…. దీనిపై ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కేసును వెనక్కి తీసుకోవాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని.. ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇస్తామంటూ… ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. నలుగురు నిందితులతో పాటు… మరి కొందరి ప్రమేయం ఉందనే ఆరోపణలు చేస్తున్నారు మృతుల కుటుంబ సభ్యులు. హైకోర్టు విచారణ కమిషన్ ముందు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కేసును వెనక్కి తీసుకోవాల్సిందిగా పోలీసులు, గుడిగండ్ల గ్రామ పెద్దలు తమపై ఒత్తిడి తెస్తున్నారని.. దిశా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

* ట‌్విట‌ర్‌తో నెల‌కొన్న ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం.త‌ప్పుడు వార్తలు వ్యాపింప‌జేసి, హింస‌కు ప్రేరేపిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ రాజ్య‌స‌భ‌లో ప్ర‌క‌టించారు.

* తూర్పు గోదావరి జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. తాజాగా రౌతులపూడి మండలంలోని ములగపూడి వీఆర్వో దేవత రైతుల నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడింది.

* మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణ మోహన్ రేపు విశాఖలో సీబీఐ ముందు హాజరు కానున్నారు.