NRI-NRT

ఇండియాలో విమాన ప్రయాణం మరింత భారం

ఇండియాలో విమాన ప్రయాణం మరింత భారం

దేశీయ విమాన ప్రయాణికులపై భారం పడనుంది. దేశీయ విమాన ఛార్జీల కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను 10-30 శాతం వరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పెంచడమే ఇందుకు నేపథ్యం. ఈ కొత్త పరిమితులు ఈ ఏడాది మార్చి 31 లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అమల్లో ఉంటాయి. కొవిడ్‌ లాక్‌డౌన్‌ అనంతరం 2020 మే 25న దేశీయ విమానాలను పునః ప్రారంభించిన సమయంలో ప్రయాణ సమయాన్ని బట్టి ఏడు శ్రేణుల్లో విభజించి, పరిమితులు విధించారు. కనిష్ఠ, గరిష్ఠ పరిమితుల సగటు ధర కంటే తక్కువకే కనీసం 40 శాతం టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. విమానయాన సంస్థల సామర్థ్యంలో 80 శాతం సర్వీసులే ఈ ఏడాది మార్చి 31వరకు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది ఇది 33 శాతంగా ఉండగా, జూన్‌ 26న ఆ పరిమితిని 45 శాతానికి; సెప్టెంబరు 2న 60 శాతానికి; నవంబరు 11న 70 శాతానికి; డిసెంబరు 3న 80 శాతానికి పెంచారు.