Videos

“Karnan” Tamil Movie Dhanush Teaser Is Here

‘మారి’ సెల్వరాజ్‌, ధనుష్‌ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్ణన్‌’. వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌ని బట్టి చూస్తే పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. లుంగీ కట్టుకుని, పెద్ద కత్తిని పట్టుకుని సహజమైన లుక్‌లో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు ధనుష్‌. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ని తాజాగా పూర్తిచేశాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత థాను సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. ‘కర్ణన్‌ సినిమా డబ్బింగ్‌ దాదాపు పూర్తయింది. ధనుష్‌ తన బెస్ట్‌ ఇచ్చాడు’ అంటూ ధనుష్‌ డబ్బింగ్‌ చెప్తోన్న ఫొటోని పంచుకున్నారు చిత్ర నిర్మాత. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఓ ఊరి సెట్‌ను రూపొందించినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

https://www.youtube.com/watch?v=3Ru4S-V6hdc