Movies

KGF దర్శకుడితో NTR

Prashanth Neel To Direct NTR After His 30th With Trivikram

ఎన్టీఆర్‌ చేయబోయే సినిమాలన్నీ ఒకొక్కటిగా ఖరారవుతున్నాయి. ఆయన తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది పూర్తయిన వెంటనే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేయనున్నారు తారక్‌. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. ప్రశాంత్‌ ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌తో చేయనున్న సినిమా పట్టాలెక్కిస్తామని మైత్రీ మూవీస్‌ సంస్థ తెలియజేసింది.