WorldWonders

హైదరాబాద్‌లో ₹480కోట్ల భారీ కుంభకోణం

480Cr Scam Using Forgery Signatures In Hyderabad

నేటి వార్తలు (13.02.2021)
మాఘ మాసం విదియ శనివారం

నేడు ప్రపంచ రేడియో దినోత్సవం

1931 ఫిబ్రవరి 13న న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది

భారత కోకిల సరోజినీ నాయుడు జయంతి

ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర వహించిన
నూతి శంకరరావు జన్మదినం

దేశవ్యాప్తంగా గత 24గంటల్లో గురువారం 9,309 కరోనా పాజిటివ్ కేసులు,87మంది మృతి

రాజస్థాన్‌‌లోని బికనేర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

యువతే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా.. విశాఖపట్నంలో భారీగా పట్టుబడిన మత్తు ఇంజక్షన్లు

22 నెలల్లో రైలు ప్రమాదాల్లో ఒక్క ప్రయాణికుడు కూడా మరణించలేదు- రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌

రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్‌ గార్డెన్‌ రేపటినుంచి పర్యాటకులకు స్వాగతం పలకనుంది. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 21 వరకు ఉదయం నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య ఉచితంగా గార్డెన్‌లోకి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు

50 ఏళ్ల పైబడిన 27 కోట్ల మందికి కరోనా టీకాలు.. త్వరలో ముఖ్యమంత్రులతో సమావేశం కానున్న ప్రధాని మోదీ

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతుల్లో చిన్నారితో సహా ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఘోర ఘటన మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలో జరిగింది

14న చెన్నైలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భారత, చైనా దేశాల మధ్య మెల్లగా ఉద్రికతలు తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. లడాఖ్ వద్ద పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉభయ దేశాల సైనిక ట్యాంక్లు వెనక్కి తరలుతున్నాయి

మా సహనాన్ని పరీక్షించొద్దు.. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము ఏ పార్టీకి లేదు.. సిరిసిల్ల కార్యకర్త సమావేశంలో కేటీఆర్

హిమాచల్‌ప్రదేశ్ మాజీ మంత్రి సుజన్ సింగ్ కన్నుమూత.. పలువురి నేతల సంతాపం

అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం, రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ పెట్రోల్ పై రూ. 5 తగ్గింపు మద్యంపై సుంకం 25 శాతం తగ్గింపు

చిన్నారి తీరా కోసం… రూ.6కోట్లు ట్యాక్స్ మాఫీ.. మానవతా దృక్పథంతో వ్యవహరించిన మోదీ సర్కార్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గీసుగొండ పోలీసుస్టేషన్‌ లో అనూష కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు.మొదటి జీతం అందుకుని పది మంది ఆకలి తీర్చిన ఈ మహిళా కానిస్టేబుల్

తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 11మంది సజీవదహనం

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతోన్న వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, రైల్వేశాఖ మాజీ మంత్రి దినేశ్‌ త్రివేది సీఎం మమతా బెనర్జీకు షాకిచ్చారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తునట్టు రాజ్యసభ సాక్షిగా ప్రకటించారు

తెలంగాణ గవర్నర్ తమిళిసై తను బాధ్యతలు చేపట్టిన నుంచి జరిగిన పరిణామాలను ఒక్కదగ్గర చేర్చుతూ పుస్తకం విడుదల చేశారు. తన అమూల్యమైన అనుభవాలకు అక్షరరూపం దాల్చారు. ‘మూవింగ్‌ ఫార్వార్డ్‌ విత్‌ మెమొరీస్‌ ఆఫ్‌ మెయిడెన్‌ ఇయర్’ పుస్తకాన్ని రిలీజ్ చేశారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగు చూసింది. ఫోర్జరీ సంతకాలు, ఫోర్జరీ పత్రాలతో రూ. 480 కోట్లు కొల్లగొట్టారు.

ఆస్ట్రేలియ‌న్‌ బీఫ్ నుంచి మహమ్మారి క‌రోనా.. చైనా వాదనను సమర్థించిన డ‌బ్ల్యూహెచ్‌వో

47 ఎస్కలేటర్లతో కశ్మీరీ గేట్ స్టేషన్ భారతదేశంలోనే అత్యధిక ఎస్కలేటర్లు ఉన్న మెట్రో స్టేషన్‌గా పేరుగాంచింది. అంతేకాకుండా 14.5 మీటర్ల పొడవుతో అత్యంత పొడవైన ఎస్కలేటర్ ఉంది కూడా ఈ స్టేషన్‌లోనే అని మెట్రో అధికారులు తెలిపారు
అందాల పోటీలు పేరు చెబితేచాలు చాలా ధనవంతులు ఈ పోటీల్లో పాల్గొంటారు అని అందరూ భావిస్తారు.. అయితే తాజాగా ఫెమినీ మిస్​ ఇండియా పోటీ ఫలితాలు ఓ యువతి తండ్రి కృషి పట్టుదలకు ప్రతీకగా నిలిచాయి. అవును విఎల్​సిసి ఫెమినీ మిస్​ ఇండియా పోటీల్లో ఆటో రిక్షా వాలా కూతురు మన్యా సింగ్ రన్నరప్​గా నిలిచింది

భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న తర్వాతే తాము ఇళ్లకు వెళతామని టికాయత్ స్పష్టంచేశారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి పలువురు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, వారి అకౌంట్లను నిలిపివేయాలని కేంద్రం ట్విటర్ ను కోరిన విషయం తెలిసిందే. వాటిలో 97 శాతం ఖాతాలు, పోస్టులను ట్విట్టర్ బ్లాక్‌ చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఎస్సీ, ఎస్టీలు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ కోల్పోతారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు

ఢిల్లీలో రైతు ఉద్యమాన్ని నడిపిస్తున్న టికాయత్‌,ఒకప్పుడు ఢిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉన్న రాకేష్‌ టికాయత్‌ ఇప్పుడు 80కోట్ల రూపాయలకు అధిపతి. ల్యాండ్స్‌, పెట్రోల్‌ పంప్స్‌, షో రూమ్స్‌, బ్రిక్స్‌ ఇలా పలు వ్యాపారాల్లో ఈయనకు పెట్టుబడులున్నాయి. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఢిల్లీ, మహారాష్ట్రల్లో వ్యాపారాలున్నాయి.