Business

భారత్‌లో అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలు-వాణిజ్యం

భారత్‌లో అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలు-వాణిజ్యం

* కృత్రిమంగా సిమెంట్, స్టీల్ ధరలు పెంచడం అన్యాయంధరలను నియంత్రణకు రెగ్యులేటరీ చట్టం తేవాలని డిమాండ్ఉపాధి లేక కూలీలు కుటుంబాలతో పస్తులుంటున్నారుసొంతింటి కల.. కలగానే నిలిచిపోతుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి.బిఎఐ, క్రెడాయి, నారెడ్కో సబ్ కా, వర్కర్స్ అసోసియేషన్ జెఎసి.విజయవాడ : సిమెంట్, స్టీల్ ఉత్పత్తి ధారులు సిండికేటైజేషన్గా ఏర్పడి కృత్రిమంగా ధరలను గత 6నెలల్లో 40% పెంచడం దారుణమని ధరల నియంత్రణకు రెగ్యులేటరీ చట్టం తేవాలని బిఎఐ, క్రెడాయి, నారెడ్కో సబ్ కా, వర్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.జాయింట్ యాక్షన్ కమిటీ దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపే మేరకు శుక్రవారం విజయవాడలో సిమెంటు, స్టీలు ధరలు తగ్గించాలని, సిమెంటు, స్టీలు ధరల నియంత్రణకు రెగ్యులేటరీ అథారిటీని నియమించాలని నిరసన తెలిపారు.

* నాలుగో రోజు పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..చమురు కంపెనీలు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి.ఇప్పటికే రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు శుక్రవారం మరోసారి పెరిగాయి.వరుసగా నాలుగో రోజు ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ పై 39 పైసల వరకు పెంచాయి.ఫిబ్రవరి మాసంలో ధరలు పెరగడం ఇది ఆరో సారి.తాజాగా పెంచిన ధరలతో ఢిల్లీ లో పెట్రోల్‌ లీటర్‌ కు రూ. 88.14 కు పెరగ్గా.. డీజిల్‌ రూ. 78.38 కి చేరింది.హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 91.65, డీజిల్‌ రూ. 85.50 కి పెరిగింది.ముంబై లో పెట్రోల్‌ రూ. 94.64, చెన్నై లో రూ. 90.44, బెంగళూరు లో రూ. 91.09, జైపూర్‌ లో రూ. 94.81, పాట్నా లో రూ. 90.86, బెంగళూరు లో రూ. 91.09, డీజిల్‌ లీటర్‌ కు ముంబై లో రూ. 85.32, చెన్నై లో రూ. 85.32, బెంగళూర్‌ లో రూ.83.09, జైపూర్‌ లో రూ. 86.89, పాట్నా లో రూ. 83.87, త్రివేండ్రం రూ. 84.28 కు చేరింది.

* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మార్చి వ‌ర‌కూ ప్రాసెసింగ్ ఫీజు లేకుండా 6.8% వ‌డ్డీ రేటుకు గృహ రుణాలు అందిస్తోంది. గృహ రుణ విభాగంలో ఎస్‌బీఐ దేశం మొత్తం మీద 34% మార్కెట్ వాటాను సాధించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఎస్‌బీఐ ఆమోదించిన ప్రాజెక్టుల‌లో గృహ రుణాలు పొందే వినియోగ‌దారుల కోసం 2021 మార్చి వ‌ర‌కూ ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. గృహ రుణ వ్యాపారం యొక్క అభివృద్ధికి, వినియోగ‌దారుల వృద్ధిని పెంచ‌డానికి బ్యాంక్ సిబ్బంది మ‌రియు వినియోగ‌దారుల అన్నీ విశ్లేష‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి బ్యాంక్ తీసుకుంటుంది. వినియోగ‌దారుల కోసం గృహ రుణ ప్రయాణాన్ని సుల‌భ‌త‌రం చేయ‌డం కోసం బ్యాంక్ అంతిమ మార్గంగా ప‌నిచేస్తుంద‌ని తెలిపింది.

* దేశంలో బంగారం ధర మరోసారి తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో పది గ్రాముల మేలిమి పసడి ధర రూ.661 తగ్గి 46,847కి చేరింది. వెండి సైతం కిలోకు రూ.347 తగ్గింది. దిల్లీలో దీని ధర రూ.67,894కి చేరింది. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గడం, రూపాయి విలువ స్వల్పంగా కోలుకోవడం దేశంలో బంగారం ధరల తగ్గుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ తపన్‌ పటేల్‌ తెలిపారు. డాలరు విలువ పెరగడం అంతర్జాతీయంగా బంగారం విలువ తగ్గడానికి కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1815 డాలర్లు ఉండగా.. వెండి 26.96 డాలర్లు ఉంది.

* మనీలాండరింగ్‌ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ, ఎండీ చందాకొచ్చర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా ఆమె దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.