Politics

మీ పదవులు మా నాయిన బిచ్చం

KTR Says T Congress Leader's Posts Are Because Of KCR

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పదేపదే విమర్శలు చేస్తున్న రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలపై మంత్రి కె. తారక రామారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న టీ కాం గ్రెస్, టీ బీజేపీ నాయకులకు ఆ పదవులు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌ పెట్టిన బిచ్చం. ఉమ్మడి రాష్ట్రంలో మీ బతుకులు జీ హుజూర్‌ తప్ప ఇంకేముందో ఆలోచించాలి. తెలంగాణ కోసం రాజీనామాలు కోరితే పారిపోయిన సన్నాసులు మీరు. చీకటిలో చిరుదివ్వెలాగా కేసీఆర్‌ ఒక్కరే ఎత్తిన జెండా దించకుండా స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. అలాంటి నాయకుడిని నిందిస్తే ఊరుకొనేది లేదు’అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.