Movies

రాజశేఖర్ ఆశలకు తమిళంలో ప్రాణం

రాజశేఖర్ ఆశలకు తమిళంలో ప్రాణం

తెలుగు చిత్రసీమలో కథానాయికలుగా విజయవంతమైన తమిళమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. అయితే, తమిళ తెరకు వెళ్లిన తెలుగమ్మాయిలు తక్కువే. వారిలో రాజశేఖర్‌ – జీవిత దంపతుల కుమార్తె శివాత్మిక ఉన్నారిప్పుడు! ఓ తమిళ చిత్రానికి ఆమె సంతకం చేశారు. చలో కోలీవుడ్‌ అంటున్నారు. గౌతమ్‌ కార్తీక్‌ కథానాయకుడిగా నందా పెరియసామి దర్శకత్వంలో రూపొందనున్న తమిళ చిత్రంలో శివాత్మిక కథానాయిక. మార్చిలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. గ్రామీణ నేపథ్యంలో చిత్ర కథాంశం ఉంటుందని, ఇదొక ఫ్యామిలీ డ్రామా అని దర్శకుడు తెలిపారు. ఇందులో శివాత్మిక లోకల్‌ టీవీ యాంకర్‌గా కనిపించనున్నారు. కథానాయికగా ఆమెకు మూడో చిత్రమిది. ‘దొరసాని’తో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక, అదిత్‌ అరుణ్‌తో మరో సినిమా చేస్తున్నారు.