DailyDose

ఎన్నికల అధికారి సస్పెన్షన్-నేరవార్తలు

Crime News - Election Officer Suspended

* రాప్తాడు మండలం బోగినేపల్లి ఆర్వో సస్పెండ్.టీడీపీ మద్దతుదారు గెలిచినా ఫలితం ప్రకటించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం.ఎన్నికల నియమావళిని అతిక్రమించాడని ఆర్వోపై చర్యలు.ఒక ఓటుతో గెలుపొందిన టీడీపీ మద్దతుదారుడు ఉజ్జనప్ప పేరు ప్రకటించని ఆర్వో.3 సార్లు ఓట్లు లెక్కించి ఫలితం చెప్పని ఆర్వో.

* ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.హైదరాబాద్‌ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.శనివారం లోక్‌సభలో మాట్లాడిన ఒవైసీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుతారని అన్నారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం భవిష్యత్‌లో ఇదే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.అంతేకాకుండా చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో నగరాలను.. యూటీలుగా మార్చే ప్రమాదం ఉందని ఆరోపించారు.

* తనను, తన కుటుంబాన్ని అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్ము కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూడా తనను అధికారులు గృహ నిర్బంధం చేశారని శనివారం ప్రకటించారు.

* ఉత్తరాఖండ్​ ఘటనలో తపోవన్​ సొరంగంలో మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి.అందులో చిక్కుకున్న 30 మంది కోసం ఏడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.తాజాగా లభించిన మృతదేహాలతో మొత్తం మృతుల సంఖ్య 41కి చేరింది.

* పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పించింది సీఆర్పీఎఫ్​.దాడి ఘటనాస్థలిలోని స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించారు అధికారులు.జవాన్ల జ్ఞాపకార్థం గత ఏడాది పుల్వామాలోని దాడి ప్రాంతంలో స్మారక స్తూపం ఏర్పాటు చేశారు.

* వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్లదాడి.గుంటూరు జిల్లా నూజండ్ల మండలంలోని ములకలూరు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ – టిడిపి వర్గాలు రాళ్ల దాడి పలువురుకి గాయాలు, గ్రామంలో ఉద్రిక్తత.

* ఆనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ఆలూరు గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణ,టీడీపీ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నారని వైసీపీ వర్గం ఆరోపణ,తాడిపత్రి రురల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ కార్యకర్తలు.రవిచంద్ర రెడ్డి,వై ప్రవీణ్ కుమార్ రెడ్డి,వంశీ యాదవ్,తలారి బయన్న..వైసీపీ కార్యకర్తలకు గాయాలు,టీడీపీ కి చెందిన వారు సైతం గాయపడినట్లు సమాచారం.