Videos

కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా….

కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా….

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యంగ్ నాగ శౌర్య, రీతు వర్మ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ‘కోల కళ్ళే ఇలా’ అనే మెలోడీ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు.

కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా
నీలి మబ్బుల్లో నేనే తేలేంతలా
కొంటె నవ్వే అలా చంపుతుంటే ఎలా
కొత్త రంగుల్లో ప్రాణమే తడిసేంతలా
మళ్ళీ మళ్ళీ రావే పూలజల్లు తేవే అనే సాహిత్యం తో సాగే ఈ గీతాన్ని గీత రచయిత రాంబాబు గోసల రచించారు. ప్రఖ్యాత గాయకుడు సిద్ శ్రీరామ్ మరోసారి వీనుల విందుగా ఆలపించిన ఈ గీతానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు ప్రాణం పోశాయి. చిత్ర నాయకా నాయికలు మధ్య ప్రేమ కు తెర రూపం గా ఈ గీతం కనిపిస్తుంది. సంగీతం, సాహిత్యం, స్వరం ఈ పాటలో పోటీ పడ్డాయనిపిస్తుంది. వీటికి తోడు నాగ శౌర్య, రీతువర్మ లు అభినయం కట్టిపడేస్తుంది.