NRI-NRT

సింగపూర్‌లో వాసవీ మాత ఆత్మార్పణ వేడుకలు

Singapore Telugu NRI NRT News - Vasavi Maatha Atmarpan Day

సింగపూర్‌లోని స్థానిక వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అక్కడి ఆర్యవైశ్యులందరూ చైనాటౌన్‌లోని స్థానిక మారియమ్మన్ ఆలయంలో విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా వాసవీ మహా శాంతి హోమం, అమ్మవారి మూల విరాట్టుకి ప్రత్యేక అభిషేకం, లలితా సహస్రనామ పఠనం జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకారంతో రథోత్సవం నిర్వహించారు.