Politics

తండ్రి బాటలో జగన్. పట్టణాల్లో మధ్యతరగతికి చౌక ఇళ్లు.

తండ్రి బాటలో జగన్. పట్టణాల్లో మధ్యతరగతికి చౌక ఇళ్లు.

రాష్ట్రంలోని మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు అందించే పథకంలో భాగంగా.. తొలి విడతలో 12 పట్టణాల్లో 18 లేఅవుట్లు అభివృద్ధి చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆయా నగరాలు, పట్టణాల్లోని జనాభా ప్రాతిపదికన కనీసం 25 నుంచి 200 ఎకరాల విస్తీర్ణంలో స్మార్ట్‌టౌన్‌ల రూపకల్పనకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. పనులు ప్రారంభించిన 18 నెలల్లోగా లే అవుట్‌ సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఇందుకు భూములిచ్చిన వారికి, ప్రభుత్వానికి ప్రయోజనం కలిగేలా పట్టణాల చుట్టూ రింగ్‌రోడ్లు నిర్మించి, వాటి చుట్టూ స్మార్ట్‌టౌన్స్‌ లేఅవుట్లు అభివృద్ధి చేసేందుకు వీలుగా అధికారులు సీఎం ముందు ప్రతిపాదనలు ఉంచారు. పట్టణ గృహనిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణ అంశాలపై జగన్‌ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ పథకం కోసం భూముల్ని ఎలా అందుబాటులోకి తీసుకురావాలి? మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి? తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.