NRI-NRT

ప్రపంచవ్యాప్తంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

NRI TRS Mahesh Bigala MP Santosh To Plant One Crore Plants Abroad

కోటి వృక్షార్చనలో పాలుపంచుకోవాలని ఎన్నారైలకు ఎంపీ సంతోష్ పిలుపు.

మహేష్ బిగాల ఆధ్వర్యంలో 50 దేశాల ప్రతినిధులతో సమావేశం .

ఎంపీ సంతోష్‌కమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక గంటలో కోటి మొక్కలు నాటే లక్ష్యంతో కోటి వృక్షార్చనకు ప్రవాసులను ఎన్నారై తెరాస సమన్వయకర్త మహేశ్ బిగాల సమన్వయపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెరాస కార్యకర్తలతో, అభిమానులతో కెసిఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరినీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ భావిస్తోందని ఆ రోజు మొక్కలు నాటుతూ దిగిన ఫొటోలను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని…యాప్‌ కోసం వాట్సప్‌ నుంచి 9000365000 నెంబర్‌ కు GIC అని మెసేజ్‌ చేయాలని కోరారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ చేస్తున్న ఈ కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్‌కుమార్‌ కోరారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వచించిన మహేష్ బిగాల మాట్లాడుతూ కెసిఆర్ జన్మదిన సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా అందరూ అభిమానులు పాలుపంచుకొంటున్నారు , ఈ సందర్బంగా ‘తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష. ఆయన ఆశయాన్ని నెరవేరుద్దాం. ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా చేపట్టబోతున్న కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి..సీఎంకి జన్మదిన కానుకగా అందిద్దాం. ప్రపంచ వ్యాప్తంగా వున్నా అన్ని తెరాస శాఖలను అయన విజ్ఞప్తి చేసారు మీ సమయం అనుకూలంగా మొక్కలను నటి మీ అభిమానినని చాటుకోవాలని అన్నారు , అతి తక్కువ సమయములోనే మా కోరికను మన్నించి వచ్చిన సంతోష్ కి ధన్యవాదాలు తెలిపారు , ఈ కార్యక్రములో ప్రతక్షంగా రాజకుమార్ శానబోయిన , మేడసాని నరేందర్ రెడ్డి , ఆన్లైన్ లో ఊఖ్ నుంచి అనిల్ కూర్మాచలం , ఆస్ట్రేలియా నుంచి కాసర్ల నాగేందర్,న్యూజీలాండ్ నుంచి జగన్ వాడ్నలా . డెన్మార్క్ నుంచి శం బాబు ఆకుల , సౌత్ ఆఫ్రికా నుంచి నాగరాజు గుర్రాల,ఒమాన్ నుంచి మహిపాల్ రెడ్డి, బహరేన్ నుంచి సతీష్ రాధారపు,కువైట్ నుంచి అభిలాష , జర్మనీ నుంచి అరవింద్ మరియు మిగితా దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ కెసిఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు - Mahesh bigala mp santosh kumar koti vruksha archana