Food

కొత్తిమీరతో పులిహోర చేస్తారా?

కొత్తిమీరతో పులిహోర చేస్తారా?

*** కావలసినవి:
కొత్తిమీర: కట్ట, బియ్యం: ఒకటిన్నర కప్పులు, పచ్చిమిర్చి: ఐదు, జీలకర్ర: టీస్పూను, ఆవాలు: టీస్పూను, సెనగపప్పు: టేబుల్‌స్పూను, మినప్పప్పు: టేబుల్‌స్పూను, పల్లీలు: 2 టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: మూడు, చింతపండుగుజ్జు: 3 టేబుల్‌స్పూన్లు, పసుపు: అరటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 4 టేబుల్‌స్పూన్లు

*** తయారుచేసే విధానం:

* బియ్యం కడిగి ఉడికించాలి.

* కొత్తిమీర, పచ్చిమిర్చి బాగా కడిగి నీళ్లు లేకుండా కాస్త ఆరనిచ్చి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.

* విడిగా మరో బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. వేగాక పసుపు, చింతపండు గుజ్జు, కొత్తిమీర ముద్ద, ఉప్పు వేసి కలుపుతూ, అంచుల్లో నూనె తేలేవరకూ వేయించాలి.

* ఉడికించిన అన్నం వెడల్పాటి బాణలిలో వేసి బాగా ఆరనివ్వాలి.

* తరవాత కొత్తిమీర ముద్ద వేసి బాగా కలపాలి. పులుపు సరిపోకపోతే కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.