WorldWonders

హెలికాప్టర్‌లో వచ్చిన సర్పంచ్

హెలికాప్టర్‌లో వచ్చిన సర్పంచ్

మహారాష్ట్రలో ఏకంగా హెలికాఫ్టర్‌లో వచ్చి గ్రామ సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు ఓ వ్యక్తి. మహారాష్ట్రకు చెందిన పారిశ్రామికవేత్త జలిందర్‌ గగరె పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. పారిశ్రామికవేత్త అయిన ఆయన వ్యాపారరీత్యా పుణెలో ఉంటారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ తాలూకాలో ఉన్న తన స్వగ్రామం అంబీ దుమాలా గ్రామానికి సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచారు. ప్రమాణ స్వీకారం చేసే సమయం రానేవచ్చింది. ప్రమాణం చేసేందుకు ఏకంగా హెలికాఫ్టర్‌లోనే వచ్చి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేశారు.