Sports

మెద్వెదెవ్ కల నెరవేరేనా?

మెద్వెదెవ్ కల నెరవేరేనా?

తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కోసం తహతహలాడుతున్న రష్యా యువ కెరటం డానియల్‌ మెద్వెదెవ్‌ ఆ కల నెరవేర్చుకునేందుకు అడుగు దూరంలో నిలిచాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో మెద్వెదెవ్‌ 6-4, 6-2, 7-5తో వరుస సెట్లలో గ్రీసు కుర్రాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ను ఓడించి.. తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. టైటిల్‌ అందుకోవాలంటే అతడు 17 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ను ఓడించాల్సిందే! ఇప్పటికే ఫైనల్‌ చేరిన జకోతో ఆదివారం మెద్వెదెవ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు.