Politics

లక్ష్మీనరసింహుడి చెంత జగన్మోహనుడు

CM Jagan Visits Antarvedhi Lakshmi Narasimha Swamy

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణోత్సవాలులో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.

తాడేపల్లి నుంచి అంతర్వేది హెలికాప్టర్లో చేరుకున్న ముఖ్యమంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం 95 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన స్వామివారి రధాన్ని ముఖ్యమంత్రి ముందుకు లాగి ప్రారంభించారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సీఎం అంతర్వేది కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు ఎంపీలు హాజరయ్యారు