Politics

జగన్ దినసరి ఆదాయం ₹300కోట్లు

జగన్ దినసరి ఆదాయం ₹300కోట్లు

సిఎం జగన్‍ రెడ్డిపై మాజీ మంత్రి జేసీ.దివాకర్‍ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‍ రెడ్డి రోజు వారీ ఆదాయం 300కోట్లు అని.. జేసీ వ్యాఖ్యానించటం సంచలనం రేపింది. రోజుకు 300 కోట్లు అంటే నెలకు 9000కోట్లు, సంవత్సరానికి ఒక లక్షా 8 కోట్లని స్పష్టం అవుతోంది. జేసీ ఆ విధమైన ఆరోపణలు ఏ ఆధారాలతో చేశారనే విషయం బయట పడనప్పటికీ..ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.